Begin typing your search above and press return to search.
పబ్బులా మారిన జైలు వీడియో షాకిస్తోంది
By: Tupaki Desk | 15 Jan 2017 10:55 AM GMTనేరాలు చేసి.. చట్టబద్ధంగా శిక్ష అనుభవించటానికి వచ్చే జైలు.. మనిషిలో పరివర్తనకు అవకాశాన్ని ఇచ్చేదిగా చెబుతారు. ఇలాంటి జైళ్లు ఎంతో ఉన్నతంగా ఉండటంతో పాటు.. అక్కడ అమలు చేసే శిక్షలతో మనిషిలో మార్పును భారీగా తీసుకురావాల్సి ఉంది. అయితే.. అందుకు పూర్తి భిన్నమైన జైలు ముచ్చట ఇప్పుడు సంచలనంగా మారింది. జైలు అంటే.. తప్పు చేసినోళ్లు శిక్ష అనుభవించటం.. క్రమశిక్షణతో ఉండటం లాంటివి గుర్తుకు వస్తాయి.
తాజాగా చెప్పేజైలు ముచ్చట అందుకు పూర్తి భిన్నం. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొన్న మహిళా ఖైదీలు.. పాటలకు స్టెప్పులు వేస్తూ.. ఫోన్లతో ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవటం.. ఛాట్ చేసుకోవటం.. సెల్ఫీలు దిగటం.. వీడియోలు తీసుకోవటం లాంటివి జరుగుతున్నాయి. తాజాగా.. వీరి యవ్వారాల గురించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పబ్ ను తలపించేలా ఉన్న ఈ జైలుఎక్కడ ఉందంటారా? అక్కడికే వస్తున్నాం.
ఉత్తర బ్రెజిల్ లోని క్యూరాడో జైలులో మహిళా ఖైదీలు వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ జైల్లో మహిళా ఖైదీలు ఏం చేస్తున్నారన్న విషయానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్థానిక బ్లాగర్ కార్లోస్ డిసిల్వా తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. పేరుకు జైల్లో ఉన్నారనే కానీ.. ఇక్కడి ఖైదీలు అనుభవిస్తున్న రాజభోగాల్ని చూసిన వారంతా షాక్ తింటున్నారు. జైల్లో శిక్ష అనుభవించాల్సిన స్థానే.. హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైల్లోనే డ్రగ్స్ సరఫరా కావటం షాకింగ్ గా మారింది. జైల్లో శిక్ష అనుభవించాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వీరి తీరుపై బ్రెజిల్ దేశ ప్రజలు మండిపడుతున్నారు.