Begin typing your search above and press return to search.

55వేల మందికి కేసీఆర్ తోఫా రూ.5వేలు

By:  Tupaki Desk   |   20 Feb 2016 5:12 AM GMT
55వేల మందికి కేసీఆర్ తోఫా రూ.5వేలు
X
వరాలు ఇవ్వటమే కాదు.. వాటిని అమలు చేయటంలోనూ దూకుడుగా వ్యవహరించే సత్తా తన సొంతమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిరూపించుకున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి వైఖరినే ప్రదర్శించిన ఆయన.. 55వేల మందికి కాస్త అటూఇటూగా ఒక్కొక్కరికి రూ.5వేల మేలు జరిగేలా చూడటం విశేషం.

తీర్చాల్సిన డిమాండ్లు చాలానే ఉన్నా.. వాటిని తీర్చే విషయంలో ప్రభుత్వాలు పెద్దగా స్పందించవు. ఆందోళనలో.. నిరసనలో చేపట్టి.. ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకొస్తే కానీ కదలని ప్రభుత్వాలకు భిన్నంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందని చెప్పొచ్చు. పొరుగుసేవల సిబ్బందికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. జనవరి నుంచి ఈ పెంపు పెరిగేలా తాజాగా నిర్ణయం తీసుకుంది.

తాజా తోఫాతో తెలంగాణ రాష్ట్రంలోని 55 వేల మంది పొరుగుసేవల సిబ్బంది జీతాలు కొంచెం అటూఇటూగా 5వేల వరకూ ఒక్కసారిగా పెరుగుతుండటం గమనార్హం. తాజా పెంపు పుణ్యమా అని మూడు కేటగిరిలో పెరిగిన మొత్తం చూస్తే.. మొదటి కేటగిరిలో పని చేసే ఉద్యోగులకు రూ.6,700 – రూ.7,400 మధ్య జీతం పొందే వారి జీతం ఇక రూ.12వేలు అందనుంది.
రెండో కేటగిరిలో పని చేసే ఉద్యోగులకు రూ.7960 –రూ.10,020 వచ్చే వారి జీతం రూ.15వేలు.. మూడో కేటగిరిలో రూ.10,900 – రూ.13,660 వచ్చే వారి జీతం తాజా మార్పుతో రూ.17,500 కానుంది.