Begin typing your search above and press return to search.
ముద్రగడ డామినేషన్ తట్టుకోలేకపోతున్నారట
By: Tupaki Desk | 17 Jan 2017 8:12 AM GMTకాపులు - బలిజలకు బీసీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న ఆందోళనల్లో చీలిక వస్తున్నట్లే కనిపిస్తోంది. కాపులతో ఇన్నాళ్లు లుకలుకలుగా సాగిన బలిజల అడుగులు ఇపుడు అసంతృప్తిని బహిరంగ పర్చే స్థాయికి చేరాయి. "కాపులను గత 64 సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నాం. ఇక ఏ మాత్రం భరించలేం. బలిజలకు రాజకీయంగా న్యాయం జరగడానికి ప్రాణాలైనా అర్పిస్తాం. నెలాఖరులోగా సీఎం చంద్రబాబును కలసి మాకు న్యాయం చేయాలని కోరుతాం" అని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు - బలిజల నేత ఓవీ రమణ ఉద్వేగంగా అన్నారు.
తిరుపతిలో తన స్వగృహంలో ఓవీ రమణ విలేఖరులతో మాట్లాడుతూ కాపులను తాము ఇప్పటి వరకు వేరుగా చూడలేదన్నారు. అయితే బలిజలకు తీరని అన్యాయం జరుగుతున్నా కాపులు, కాపు నాయకులు నోరు విప్పకపోవడంతో తాము పెదవి విప్పాల్సి వచ్చిందని తెలిపారు. కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ సింహభాగం వారే లబ్ధి పొందుతున్నారని రమణ ఆరోపించారు. రాజకీయంగా లబ్ధి పొందిన వారు కాపులేనని, బలిజలు కనుచూపుమేరలో కూడా లేరని చెప్పారు. అందుకే నేడు రాయలసీమలో ఉద్యమం అనివార్యమైందని తెలిపారు. ఏ విధంగా మున్నూరు కాపులు - తూర్పులకు రిజర్వేషన్లు ఇచ్చారో అలాగే బలిజలకు కూడా ఇవ్వాల్సి ఉన్నా వాటి గురించి ఆలోచించే నాథుడే కరవయ్యారని రమణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బలిజలకు సంబంధించి మంజునాథ కమిషన్ ను కలసి వినతిపత్రం ఇచ్చానని, ఆయన కూడా బలిజలకు జరుగుతున్న అన్యాయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నారు. బలిజల్లో వెనుకబాటుతనంలో మహిళలు పడుతున్న అవస్థలు మాటల్లో చెప్పలేనంటూ రమణ ఈ సందర్భంగా ఉద్వేగానికి గురై కంటతడిపెట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/