Begin typing your search above and press return to search.
ఆ ఆసుపత్రిలో వెయ్యి మంది చిన్నారులు మృతి!
By: Tupaki Desk | 21 Feb 2019 7:15 AM GMTవిన్నంతనే కరెంటు షాక్ తగిలినట్లుగా అనిపించే ఉదంతమిది. ఒక ఆసుపత్రిలో వెయ్యి మందికి పైగా చిన్నారులు మరణించారన్న కఠోర వాస్తవం ఒకటి వెలుగు చూసింది. ఐదేళ్ల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో చిన్నారులు మరణాలకు సదరు ఆసుపత్రి వేదికైందన్న విషయం తాజాగా గుజరాత్ అసెంబ్లీలో వెల్లడైంది.
ఆదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఒక ఆసుపత్రిలో గడిచిన ఐదేళ్ల కాలంలో వెయ్యికి పైగా చిన్నారులు మరణించారు. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం కమ్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ అసెంబ్లీలో వెల్లడించారు. క్వశ్చన్ అవర్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఐదేళ్ల కాలంలో 1018 మంది చిన్నారులు మరణించారని చెప్పిన ఆయన.. గడిచిన ఐదేళ్లలో చిన్నారుల మరణాల్ని వెల్లడించారు. 2014-15లో 188 మంది.. 2015-16లో 187 మంది.. 2016-17లో 208 మంది.. 2018-19 ఇప్పటివరకూ 1569 మంది చిన్నారులు మరణించినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
జీకే ఆసుపత్రిలో మరణించిన చిన్నారుల లెక్కపైన దర్యాప్తు చేపట్టటానికి ఇప్పటికే ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరనించిన చిన్నారుల్లో ఈ ఆసుపత్రిలో జన్మించిన చిన్నారులతో పాటు.. వేరే ఆసుపత్రుల రిఫరెన్స్ మీద వచ్చిన వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఇంత భారీగా మరణాలు చోటు చేసుకోవటం విస్మయకరంగా మారింది.