Begin typing your search above and press return to search.
ట్రంప్ కి షాకిచ్చేందుకు 130 మంది ఆడాళ్లు రెఢీ
By: Tupaki Desk | 18 July 2016 6:32 AM GMTవివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కంపు వాతావరణాన్ని క్రియేట్ చేసే డోనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చేందుకు అమెరికాలోని 130 మంది మహిళలు సిద్ధమయ్యారు. తాము నివసించే ప్రాంతమైన క్లీవ్ లాండ్ స్థానిక చట్టాలకు విరుద్ధంగా వారు ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోటోషూట్ ఇచ్చారు. ట్రంప్ ను ఒక ‘‘లూజర్’’గా (పరాజితుడు) అభివర్ణిస్తూ.. వారీ న్యూడ్ ఫోటోషూట్ చేపట్టటం గమనార్హం.
మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగాలన్న ప్రయత్నంలో ఉన్న ట్రంప్ తాజాగా క్లీవ్ లాండ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే ప్రాంతంలోనే ఆయనకు వ్యతిరేకంగా మహిళలు నగ్నంగా ఫోటోషూట్ ను పూర్తి చేశారు. క్లీవ్ లాండ్ లోని స్థానిక చట్టాల ప్రకారం.. బహిరంగ నగ్న ప్రదర్శన నిషేధం. అయితే.. ట్రంప్ విధానాలు.. ఆయన వ్యాఖ్యలకు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేసేందుకే తామీ పని చేసినట్లుగా 130 మంది మహిళలు చెప్పుకొచ్చారు.
బహిరంగ నగ్న ప్రదర్శన.. ఫోటో షూట్ చట్టవిరుద్ధమైనప్పటికీ.. ఈ షూట్ జరిగేందుకు వీలుగా తన ప్లేస్ ను ఒకరు ఇచ్చేందుకు అంగీకరించటం.. వారు సైతం ట్రంప్ కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక.. ఈ సంచలన ఫోటో షూట్ ను చేపట్టిన ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ కు ఈ తరహా షూట్ చేయటం అస్సలు అలవాటు లేదట. ఇదే తొలిసారిగా ఆయన చెబుతున్నారు. సంచలన వార్తాంశంగా మారిన ఈ ఫోటో షూట్ ను ఎప్పుడూ విడుదల చేస్తారన్న ప్రశ్నకు వారు బదులిస్తూ.. ఎన్నికలకు ముందుగా అంటే.. నవంబరు 8న రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. మరి.. ఈ న్యూడ్ ఫోటో షూట్ ట్రంప్ కు ఎంతటి వ్యతిరేకతను తీసుకొస్తుందో చూడాలి.