Begin typing your search above and press return to search.
సంచలనంగా పుల్వామా అమరవీరులకు ఆమె విరాళం !
By: Tupaki Desk | 22 Feb 2019 5:03 AM GMTవేలాది కోట్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేసే ప్రభుత్వాలు.. తమ విలాసాల కోసం కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసే పాలకులకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లు.. వారి కుటుంబాలు అస్సలు కనిపించవా? పుల్వామా ఉగ్రదాడిలో బలైన అమరవీరుల కోసం.. వారి కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా నిలవటానికి ప్రభుత్వాలు.. అధినేతలు ఎందుకు ముందుకు రారు? అన్నది ప్రశ్న.
పాలకులకు చెంపపెట్టుగా మారిన ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఒక యాచకురాలు తన జీవితాంతం కూడబెట్టిన రూ.6.6లక్షల మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులకు చెందేటట్లుగా పేర్కొని మరణించింది. ఆమె మరణానంతరం తమకు వచ్చిన ఆ మొత్తాన్ని ఖర్చు చేయకుండా.. ఒక మంచి కార్యక్రమం కోసం వినియోగించాలని భావించిన వారిద్దరూ తాజాగా పుల్వామా అమరవీరుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించటంతో యాచకురాలి కథ ఇప్పుడు వెలుగు చూసింది.
రాజస్థాన్ లోని అజ్మీర్ ప్రాంతంలో బజరంగఢ్ లోని అంబె మాతా మందిర్ ఉంది. దాని ఎదుట ఒక వృద్ధురాలు యాచిస్తూ ఉండేవారు. ఆమెను మిగిలిన యాచకురాలిగా చూడకుండా.. పలువురు ఆమెకు ఆహారం..దుస్తులు ఇస్తుండేవారు. తనకు వచ్చిన మొత్తాన్ని ప్రతి రోజు బ్యాంకులో డిపాజిట్ చేసే సదరు యాచకురాలు గత ఏడాది ఆగస్టులో మరణించారు. తను కూడబెట్టిన రూ.6.6 లక్షల మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులకు అందజేయాలని ఆమె బ్యాంకు పత్రాల్లో పేర్కొన్నారు. దీంతో.. వారిద్దరికి యాచకురాలి మొత్తం అందింది.
అయితే.. ఆ మొత్తాన్నితమ అవసరాలకు వాడుకోకుండా ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు చేయటం ద్వారా.. యాచకురాలి పేరును నలుగురికి తెలిసేలా చేయటమే కాదు.. తాను బతికున్న రోజుల్లో తాను కూడబెట్టిన మొత్తాన్ని దేశానికి ఉపయోగపడేలా చేయాలని తపించేదట. దీనికి తగ్గట్లే.. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా నిలిచేలా రూ.6.6లక్షల మొత్తాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. దేశం కోసం ఒక యాచకురాలు పడిన తపన చూసైనా పాలకులు తమ తీరు మార్చుకుంటే బాగుంటుందేమో?