Begin typing your search above and press return to search.
ఓవర్ టు మోడీ : టీఆర్ఎస్ పొలిటికల్ పంచ్ అదిరిందిరో!
By: Tupaki Desk | 22 April 2022 1:28 AM GMTరాజకీయంలో వైరం కారణంగా రెండు పార్టీలు అదే పనిగా తమని తాము ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైరం కారణంగానే రెండు పార్టీలు అదే పనిగా తిట్టుకుంటున్నాయి కూడా! ఎన్నడూ లేనిది కేటీఆర్ పరోక్షంగా దేశ ప్రధానిని ఉద్దేశించి కొన్ని రాయకూడని మాటలు పలికారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్ర స్వరంతో మాట్లాడుతోంది.
ఇదే సమయంలో బీజేపీ నాయకులు కూడా ప్రతిస్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఆ పార్టీ అనుబంధ విభాగంగానే పరిగణించే తెలంగాణ జాగృతి కూడా మోడీని భలే ఎటాక్ చేస్తుంది. టామ్ అండ్ జెర్రీ వార్ లో గెలుపు ఎవరిది? ఆ విధంగా ఎవరెటు ? ప్రజలెటు ?
ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏదో ఒక విధంగా భారతీయ జనతా పార్టీ సేనలను తిడుతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని తెలంగాణ జాగృతికి సంబంధించిన సభ్యుల వరకూ క్రియాశీలకంగా ఉంటూ, కేంద్రం తప్పిదాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ మొదటి సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ ముందస్తుకు పోయి జన క్షేత్రంలో విపక్ష పార్టీలతో యుద్ధం చేసినప్పుడు కానీ ఇంతగా మాట్లాడింది లేదు.
ఇంతగా నోరేసుకు పడిపోయిందీ లేదు. అప్పుడు బీజేపీతో బంధాలు బాగున్నాయి. ఆ రోజు మోడీతో కేసీఆర్ ఢీ కొట్టిన సందర్భాలే అరుదు. కానీ ఇప్పుడు మాత్రం అవి బెడిసికొట్టాయని పైకి అనిపిస్తోంది. కానీ తెర వెనుక ఆ రెండు పార్టీలూ దోస్తీ కడుతున్నాయి అని కొందరు పరిశీలకులు మరియు కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. వాస్తవాలేంటన్నది దేశ రాజధాని, వసంత విహార్ కేంద్రంగా జరుగుతున్న తెలంగాణ భవన్ నిర్మాణమే చెప్పబోతోంది.
ఇక టీఆర్ఎస్ పంచులు ఎలా ఉన్నాయి అంటే.,. ఎవరి పైసలుతో వాడు అకౌంట్ ఓపెన్ చేసుకోవడాన్ని జన్ ధన్ ఖాతా అని బిల్డప్ ఇవ్వడం ఏంటి? ఎవడి ఇల్లును వాడు ఊడ్చుకునేదానికి స్వచ్ఛ్ భారత్ అని తెగ ప్రచారం చేసుకోవడం దేనికి? ఎవరి ఆడ బిడ్డలను వారు చదివించుకునే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వడానికి భేటీ పడావో భేటీ బచావో అని చెప్పుకుని తిరగడం దేనికి ? అంటూ మండి పడుతోంది.
ఎవడి అవసరాలకు వాడు అప్పులు తెచ్చుకుంటే (బ్యాంకుల నుంచి) దాని పేరే : ఆత్మ నిర్బర్ భారత్ ..ఎవడి పైసలు వాడే దాచుకుంటే దాని పేరే : సుకన్య సమృద్ధి యోజన అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మాటల దాడి చేసింది ఇవాళ.