Begin typing your search above and press return to search.
ఓవర్ టు శ్రీకాకుళం : ఆమె చెబుతుంది..అతడు వింటాడు..
By: Tupaki Desk | 10 Feb 2022 8:32 AM GMTఆంధ్రావని రాజకీయాల్లో చిత్రమయిన పరిణామాలే నెలకొంటున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం రాజకీయ నాయకుల కుటుంబాల లో విమెన్ డామినేషన్ బాగానే ఉంది.ఆ విధంగా నిర్ణయాక శక్తిగా ఆమెనే నిలుస్తున్నారు.ఆమెనే డ్రైవింగ్ ఫోర్స్ అవున్నారు.ఆమె మాత్రమే అంతా అయి నడిపిస్తున్నారు.పలు వివాదాలకు తావిస్తున్నారు కూడా! మంత్రి సీదిరి అప్పల్రాజు విషయంలో కానీ
డిప్యూటీ స్పీకర్ ధర్మాన కృష్ణ దాసు విషయంలో కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో కానీ అంతా వారి ఇంట ఇల్లాటి చేతిలోనే ఉన్నారు.వారే సిసలు కథ నడిపిస్తున్నారు.వారే కొన్ని వివాదాలకు, ఆరోపణలకు,ఆర్థిక లావాదేవీలకు కూడా కారణం అవుతున్నారు.
మంత్రి సీదిరి అప్పల్రాజు విషయంలో ఆయన భార్య శ్రీదేవి నిర్ణయాలే ఎక్కువగా అమలవుతుంటాయి అని అంటారు.వీరిది ప్రేమ వివాహం.ఆమె సామాజికవర్గం కాళింగ..ఈయన సామాజిక వర్గం మత్స్యకార.దీంతో ఆర్థిక లావాదేవీలు అన్నీ శ్రీదేవి నడిపిస్తారని, కొన్నిసార్లు మంత్రి మాట కూడా చెల్లదన్నది ఓ సమాచారం.
కొన్ని సార్లు ఆమె మాట నెగ్గకపోతే అధికారులను టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక డిప్యూటీ స్పీకర్ ధర్మాన కృష్ణదాసు విషయానికే వస్తే ఆయన భార్య పద్మ ప్రియ కృష్ణ దాసు.ఆమె వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు కూడా! శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొట్టమొదటి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఆమే కావడం గమనార్హం.ఆ ఇంట కూడా పద్మ ప్రియ కృష్ణ దాసు మాటే చెల్లాలి. చిన్న కుమారుడు కృష్ణ చైతన్య అంతా తానై రాజకీయం నడుపుతున్నాడు.ఈయన ప్రస్తుతం పోలాకి జెడ్పీటీసీగా ఉన్నారు.
అనేక ఆర్థిక లావాదేవీలలో తల్లీ కొడుకుల పాత్రకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర ఫిర్యాదులు కూడా ఉన్నాయి.గతంలో ఇవేవీ వద్దని కృష్ణదాసుకు ముఖ్యమంత్రి చెప్పి చూశారని కూడా సమాచారం.ఆఖరుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంట కూడా లేడీ డామినేషనే! ఆయన భార్య వాణీ సీతారాం తొగరాం సర్పంచ్. కానీ పొందూరు మండల సర్వసభ్య సమావేశాల్లో అన్నీ తానై వ్యవహరిస్తూ మీడియాకు కూడా చిక్కారు. ఆమె కూడా వివాదాస్పద వ్యవహారాల్లో ఉన్నారు.