Begin typing your search above and press return to search.

ఆ 3 వ‌స్తువులుంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్‌!

By:  Tupaki Desk   |   7 Aug 2017 8:16 AM GMT
ఆ 3 వ‌స్తువులుంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్‌!
X
మీ ఇంట్లో రిఫ్రిజిరేట‌ర్‌ - వాషింగ్ మెషిన్‌ - టూ వీల‌ర్ ఉన్నాయా? పోనీ, నాలుగు రూముల ఇల్లు లేదా కారు లేదా ఎయిర్‌ కండీషనర్ ల‌లో ఏదైనా ఒక‌టి ఉందా? అయితే, ఇక పై మీరు ప్ర‌భుత్వం త‌ర‌పున సంక్షోమ ప‌థ‌కాల‌కు అర్హులు కారు. అర్హ‌లు కాక‌పోయినా ఎలాగోలా ఆ ప‌థ‌కాల‌ను పొందే వీలు కూడా ఇక‌పై ఉండ‌దు. ఎందుకంటే, ఆ వ‌స‌తులు కలిగి ఉన్న పట్టణ ప్రాంత ప్రజలను ఆటోమేటిక్‌ గా సంక్షేమ పథకాల నుంచి తొల‌గించాల‌ని ప్ర‌భుత్వానికి వివేక్ దేబ్రాయ్ కమిటీ ప్రతిపాదించింది. ఒక వేళ ఆ వ‌స‌తులు మీకు లేకుంటే ఆటోమేటిక్ గా సంక్షేమ ప‌థ‌కాల జాబితాలో మీ పేరు ఆటోమేటిక్ గా న‌మోద‌వుతుంది. ఈ ప్ర‌కారం ఒక నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. ఈ విధంగా ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఒకేసారి తీపి చేదు క‌బుర్ల‌ను ఆ క‌మిటీ అందించింది.

ఒక వేళ ఆ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డితే పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది గృహదారులలో ఆరుగురు కచ్చితంగా ప‌థ‌కాల‌కు అన‌ర్హులవుతారు. సామాజిక ఆర్థిక సర్వే చేపట్టి అన్ని అంశాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత‌ ఈ కమిటీ త‌న ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వానికి నివేదించింది. నివాసిత - వృత్తిపరమైన - సామాజిక లేమి వంటి అనేక అంశాల ప్రాతిప‌దిక‌న ఆటోమేటిక్‌ గా పట్టణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాల ల‌బ్ధిదారులుగా అవకాశం కల్పించాలని కూడా ఈ కమిటీ సూచించింది.

పాలిథిన్‌ రూఫ్ ఇళ్లు కలిగిన వారు - అసలు ఇళ్లు లేని వారికి ప్ర‌భుత్వ పథ‌కాలు - ప్రయోజనాలను అందించాలని సూచించిది. అంతేకాకుండా ఆదాయం లేని వారికి, కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేని వారికి లేదా కుటుంబ పెద్దగా పిల్లలు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న వారికి సంక్షేమ పథకాల ఫ‌లాల‌ను అందించాలని పేర్కొంది. మిగిలిన ప్రజలు తాము ప్రజాసంక్షేమ ప్రయోజనాలు పొందుతామో? లేదో? అంచనావేసుకోవాలని సూచించింది. హసిమ్‌ ప్యానల్‌ ప్రతిపాదల ప్రకారం 41 శాతం పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ ప్ర‌యోజ‌నాల‌కు అర్హుల‌వుతారో, కారో అంచనావేసుకోవాల్సి ఉంది. వివేక్‌ దేబ్రాయ్‌ కమిటీ ప్ర‌కారం 59 శాతం మంది తమ అర్హతను అంచనావేసుకోవాల్సి ఉంద‌ని సంబంధిత వర్గాలు తెలిపాయి.