Begin typing your search above and press return to search.

ట్రంప్ కు స్వపక్షమే ఎంతలా దెబ్బేస్తుందంటే.

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:24 PM GMT
ట్రంప్ కు స్వపక్షమే ఎంతలా దెబ్బేస్తుందంటే.
X
కంపు మాటలతో నిత్యం వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తీరును ఆయన రాజకీయ ప్రత్యర్థులు కాదు.. సొంత పార్టీ నేతలే విరుచుకుపడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రత్యర్థులకు ధీటుగా సొంత పార్టీకి చెందినోళ్లే ట్రంప్ ను తీవ్రంగా తిట్టిపోయటమే కాదు.. అమెరికాకు అధ్యక్షుడయ్యే అర్హత ఆయనకు లేదంటే లేదని బల్ల గుద్ది వాదిస్తుండటం గమనార్హం. ట్రంప్ కానీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు ఆయన ప్రమాదకర అధ్యక్షుడిగా మారతారని.. దేశ భద్రత సైతం ప్రమాదంలో పడుతుందని ట్రంప్ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.

ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన జాతీయ భద్రతా నిపుణులు యాభై మంది తొలిసారి ట్రంప్ మీద తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు. తాజాగా వారు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ట్రంప్ కానీ గెలిస్తే అమెరికా ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన యాభై మంది అల్లా టప్ప వ్యక్తులు కాకపోవటం గమనార్హం. వారంతా అమెరికా అధ్యక్షులుగా పని చేసిన రిచర్డ్ నిక్సన్ నుంచి జార్జిబుష్ వరకూ రిపబ్లికన్ల క్యాబినెట్ లో మంత్రులుగా పని చేసిన వారూ.. దౌత్యవేత్తలు.. గూఢచారులు ఉన్నారు. తమలో ఎవరూ ట్రంప్ కు ఓటు వేయమని తేల్చేసిన వారు.. అధ్యక్ష పదవికి ట్రంప్ ఏ మాత్రం సూట్ కారంటూ కొట్టి పారేయటం గమనార్హం. ఇంత తీవ్రస్థాయిలో తనపై విమర్శలు చేసిన వారిని ఎప్పటి మాదిరే.. సింఫుల్ గా కొట్టి పారేయటమే కాదు.. వారంతా వాషింగ్టన్ కు చెందిన సంపన్నులుగా పేర్కొన్నారు. వారి వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సింఫుల్ గా తేల్చేయటం గమనార్హం. ఇలా.. అందరిని లైట్ తీసుకుంటూ పోతే చివరకు ట్రంప్ వెనుక అండగా నిలిచేందుకు ఉండరన్న మాట వినిపిస్తోంది.