Begin typing your search above and press return to search.
వణికిపోతున్న యాజమాన్యాలు
By: Tupaki Desk | 23 Dec 2021 4:28 AM GMTరాష్ట్రంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు వణికిపోతున్నాయి. జీవో నెంబర్ 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేక, నిర్వహణ సరిగా లేని థియేటర్లను ప్రభుత్వం మూయించేస్తోంది. థియేటర్ల నిర్వహణ ఎలాగుందనే విషయమై హఠాత్తుగా రెవిన్యు, పోలీసు శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. చాలా థియేటర్లకు అధికారులు స్వయంగా వెళ్ళి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో ఏకకాలంలో పరిశీలనకు అధికారుల బృందం రంగంలోకి దిగింది.
టయిలెట్ల నిర్వహణ, క్యాంటిన్ నిర్వహణతో పాటు అమ్మకాల ధరలు, వెహికల్ పార్కింగ్, అగ్నిప్రమాద నివారణ చర్యలు, థియేటర్లలో కరనో వ్యాక్సినేషన్ స్క్రీనింగ్ లాంటి అనేక అంశాలను అధికారులు పట్టిపట్టి మరీ చూశారు. తమ పరిశీలనలో నిర్వహణ సరిగా లేని థియేటర్లకు అధికారులు నోటీసులిచ్చారు. కొన్నింటిని మూయించేశారు. కృష్ణాజిల్లాలోని 15 థియేటర్లను తనిఖీచేసిన అధికారులు వాటిల్లో 12 థియేటర్లను మూయించేశారు. మిగిలిన వాటిని నోటీసిలిచ్చారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, ఒంగోలులో చాలా థియేటర్లను తనిఖీలు చేశారు. వీటిల్లో చాలావాటికి నోటీసులిచ్చిన అధికారులు వీటిల్లో కొన్నింటిని తాత్కాలికంగా మూయించేశారు. నోటీసులిచ్చిన లేదా మూయించేసిన థియేటర్లలో కామన్ పాయింట్లు ఏమిటంటే టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవటం, క్యాంటిన్లలో ఉండాల్సిన ధరలకన్నా చాలా ఎక్కువగా ఉండటం.
చాలా థియేటర్లలో అతిపెద్ద సమస్య ఏమిటంటే లైసెన్స్ గడువు దాటిపోయినా రెన్యువల్ తీసుకోకపోవటం. అలాగే కరెంటు బిల్లు సరిగా కట్టకపోవటాన్ని కూడా అధికారులు గుర్తించారు. రెన్యువల్ చేయించుకోకుండానే థియేటర్లు నడుపుతున్న యాజమాన్యాలకు తలా 2 లేదా 3 లక్షల రూపాయల ఫైన్ వేశారు. పలానా తేదీలోగా రెన్యువల్ చేయించుకోకపోతే థియేటర్లను మూసేస్తామని అధికారులు యాజమాన్యాలకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా హెచ్చరించారు.
నిజానికి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండానే థియేటర్ల రన్ చేయటమన్నది చాలా కాలంగా జరుగుతున్నదే. ఈ విషయం రెవిన్యు, మున్సిపల్ అధికారులకు బాగా తెలుసు. అయినా తెరవెనుక కారణాలతో ఎవరు పట్టించుకోవటంలేదు. అయితే ఇపుడు ప్రభుత్వం బాగా సీరియస్ అవటంతో క్షేత్రస్ధాయిలోని అధికారులు తనిఖీలు చేసి కొరడాలు ఝుళిపించక తప్పటంలేదు. దాంతో థియేటర్ల యాజమాన్యాల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.