Begin typing your search above and press return to search.

మరో వినూత్న ప్రయోగానికి ఆక్స్‌ఫర్డ్ శ్రీకారం .. దేనికోసమంటే ?

By:  Tupaki Desk   |   23 Jun 2021 9:33 AM GMT
మరో వినూత్న ప్రయోగానికి ఆక్స్‌ఫర్డ్  శ్రీకారం .. దేనికోసమంటే ?
X
కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టడానికి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ , తాజాగా మరో కీలక ప్రయోగానికి తెరతీసింది. జర్మనీకి చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన ఈ టీకా .. మనదేశంతో పాటుగా , ఇంకా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. భారత్‌ లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మెజారిటీ వాటా కోవిషీల్డ్‌ దే . పుణేకు చెందిన సీరమ్ ఇన్‌ స్టిట్యూట్ ఈ టీకా ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

యాంటీ-పారాస్టిక్ డ్రగ్ ఐవర్‌ మెక్టిన్ (Ivermectin)ను వినియోగించడంపై పరిశోధనలు ప్రారంభించారు. ఐవర్‌ మెక్టిన్‌‌ పై సాగిస్తోన్న ఈ ప్రయోగాలు విజయవంతమైతే, మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని , కరోనా వైరస్ బారిన పడిన బాధితులకి అందజేసే వైద్య చికిత్సలో ఐవర్‌ మెక్టిన్‌ ను వినియోగించడానికి వీలు కలుగుతుందని, దీనివల్ల మరింత వేగంగా కోలుకోవడానికీ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ప్రారంభదశలో సైతం ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఐవర్‌మెక్టిన్ డ్రగ్ ఉపయోగపడేలా దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం ఉపకరిస్తుందని అంటోన్నారు. ప్రారంభ దశలో దీన్ని వినియోగించడం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్ తీవ్రత గణనీయంగా తగ్గిందనే విషయం తమ అధ్యయనంలో తేలినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తెలిపింది.

ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వానికి ఓ నివేదికను అందించినట్లు తెలుస్తోంది. ఆక్స్‌ ఫర్డ్ చేస్తోన్న ఈ ప్రయత్నాలకు బ్రిటన్ ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడిన పేషెంట్లకు అందించే చికిత్సలో ఐవర్‌ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నప్పటికీ , దాన్ని వాడాలని మాత్రం రెఫర్ చేయలేదు. దీర్ఘకాలంలో దీనివల్ల ప్రతికూల ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ఐవర్‌మెక్టిన్‌ చికిత్స పొందినవారిలో 56 శాతం తక్కువగా మరణాలు ఉన్నప్పటికీ దాని వినియోగానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ పరిస్థితుల్లో దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం చేపట్టింది.