Begin typing your search above and press return to search.
ప్రపంచానికి శుభవార్త..ఆ రెండు వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్!
By: Tupaki Desk | 16 May 2020 7:15 AM GMTయావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరకు వచ్చేసిందా? కొరకరాని కొయ్యలా మారిన మాయదారి రోగానికి మందు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటివేళ.. రెండు సంస్థలు చేపట్టిన ట్రయల్స్ సక్సెస్ కావటం గుడ్ న్యూస్ గా చెప్పాలి. జంతువుల మీద జరిపిన ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చాయని.. మరికొంత ప్రయత్నం జరిగితే.. యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమం అయినట్లేనని చెబుతున్నారు.
మాయదారి రోగానికి మందు కనిపెట్టే సంస్థల్లో కెనడా ఔషధ సంస్థ మెడికగో.. అమెరికాకు చెందిన ఆక్సఫర్డ్ వర్సిటీలు చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి తాము జరిపిన ప్రయోగాల్లో జంతువులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని చెబుతున్నారు. మనుషులపై ప్రయోగాలకు సంబంధించి మరికొంత కాలం పట్టొచ్చన్న వాదన వినిపిస్తోంది.
మెడికగో నిర్వహించిన తాజా ప్రయోగంలో.. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించినట్లుగా చెబుతున్నారు. సింగిల్ డోస్ ను ఎలుకలపై ప్రయోగించగా.. పది రోజుల వ్యవధిలో యాంటీబాడీస్ అద్భుతంగా పని చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. మనుషులకు ఎన్ని డోసులు ఇవ్వాల్సి ఉంటుందన్న విషయంపై స్పష్టత రాలేదని చెబుతున్నారు. తాజా వ్యాక్సిన్ ప్రయోగం ఇరవై రోజుల వ్యవధిలోనే నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. ఈ సంస్థ తాను సిద్ధం చేసిన వ్యాక్సిన్ ను తయారీ మొదలు పెడితే ఏడాదిలో 20 నుంచి 100 మిలియన్ డోసుల్ని సిద్ధం చేసే అవకాశం ఉందంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ జరుపుతున్న ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. తాజాగా ఈ వర్సిటీ జరిపిన ప్రయోగాల్లో తాము రూపొందించిన వ్యాక్సిన్ ను కోతులపై ప్రయోగించారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచటమే కాదు మాయదారి వైరస్ ను అడ్డుకునే సామర్థ్యం ఉందన్న విషయం తేలిందంటున్నారు. ఈ ప్రయోగంలో సైడ్ ఎఫెక్టులు ఏమీ కనిపించ లేదన్న మాట వినిపిస్తోంది.
తాము తయారు చేసిన వ్యాక్సిన్ డోసును కోతులకు ఇస్తే.. మిగిలిన వాటితో పోలిస్తే.. వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో రోగ నిరోధక శక్తితో పాటు.. ఊపిరితిత్తుల్లో ద్రవం తగ్గటం.. శ్వాసనాళంలో కణజాలం వైరస్ ను అడ్డుకోవటాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్ కారణంగా ఇతర అవయువాలపై వైరస్ తీవ్రత తగ్గిందన్న విషయాన్ని గుర్తించారు. తాము జరిపిన ప్రయోగాలు ఆశాజనంగా ఉన్నప్పటికీ మనుషుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ రెండు సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు.. ప్రపంచానికి శుభవార్తగా మారటమే కాదు.. పాత ప్రపంచంలోకి ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పక తప్పదు. అలాంటి రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.