Begin typing your search above and press return to search.

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్:​ వృద్ధుల్లోనూ మంచి ఫలితాలు..!

By:  Tupaki Desk   |   20 Nov 2020 4:30 AM GMT
ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్:​ వృద్ధుల్లోనూ మంచి ఫలితాలు..!
X
సాధారణంగా వ్యాక్సిన్లు వృద్ధులకు సమర్థవంతంగా పనిచేయవు. చిన్నపిల్లలు, టీనేజర్స్​, మధ్య వయస్సుల వాళ్లతో పోల్చుకుంటే వృద్ధుల్లో రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాక్సిన్​ సరిగ్గా పనిచేయదు. ఈ నేపథ్యంలో ఆక్స్​ఫర్డ్​ పరిశోధనల్లో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసిందే. ఆక్స్​ఫర్డ్​ అందుబాటులోకి తెచ్చిన వ్యాక్సిన్​ వృద్ధుల్లో కూడా మెరుగైన ఫలితాలు చూపించినట్టు ప్రయోగాల్లో వెల్లడైంది.

560 మంది వృద్ధులపై జరిగిన లాన్సెట్ రెండో దశ పరీక్షల ఆధారంగా పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు. వృద్ధులను కూడా ఈ వ్యాక్సీన్ కాపాడగలదని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​కు సంబంధించిన మూడో దశ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే వీటి ఫలితాలు రానున్నాయి. ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్​ పనితీరుపై శాస్త్రవేత్తలు ఓ అంచనాకు రానున్నారు. పైజర్-బయోఎన్‌టెక్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లకు సంబంధించిన మూడో దశల ప్రాథమిక గణాంకాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

అయితే బ్రిటన్ ఆస్ట్రాజెనెకా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్​ వృద్ధులపై మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు సమాచారం. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​తో 70 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కూడా బలమైన రోగనిరోధక స్పందనలు కనిపిస్తున్నాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ఆండ్రూ పొల్లార్డ్ తెలిపారు. ‘మిగతా వ్యాక్సీన్లతో మాకు పోటీ లేదు. ఇంకా విజయవంతం కావాల్సిన ఎన్నో టీకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరినీ కాపాడ్డానికి మనకు అవన్నీ కావాలి’ అని అన్నారు.