Begin typing your search above and press return to search.

66 రోజుల్లో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   30 Aug 2020 11:50 AM GMT
66 రోజుల్లో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
X
ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ 66 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని.. 130 కోట్ల భారతీయుల కోసం కనీసం 100 కోట్ల డోసులను తయారు చేయాలని సీరమ్ ఇన్ స్టిట్యూట్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా, భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగాలు ఇంకా రెండో దశలో ఉన్నాయి. మూడో దశను దాటుకొని 66 రోజుల్లో అందుబాటులోకి తేవాలని పరిశోధకులు భావిస్తున్నారు.మూడో దశ ప్రయోగాల్లో భాగంగా ఫుణేలోని ఓ ఆసుపత్రిలో ఏడుగురికి టీకా ఇప్పటికే అందించారు. దేశంలో మొత్తం మీద 17 కేంద్రాల్లో 1600మందికి ఈ టీకా అందిస్తారు. ప్రయోగాలు 58 రోజుల్లో పూర్తి చేసి మరో 15 రోజుల్లో విశ్లేషించి టీకా రిలీజ్ చేస్తారు.

ఈ క్రమంలోనే 66 రోజులకు టీకా వాణిజ్యస్థాయి ఉత్పత్తి మొదలవుతుందని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే 8 నెలల్లో పూర్తి కావాల్సిన మూడో దశ ప్రయోగాలను కరోనా దృష్ట్యా తగ్గించారని అంటున్నారు. కోవిషీల్డ్ 66 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

కాగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి 68 కోట్ల డోసులను తీసుకోవాలని.. మిగతా భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా నుంచి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఇవన్నీ 130 కోట్ల మంది జనాభాకు పంచాలని చూస్తోంది.