Begin typing your search above and press return to search.
ఇంటివద్దకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ .. ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం !
By: Tupaki Desk | 16 May 2021 2:30 AM GMTదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ మాములుగా లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ తరహాలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు చోటు చేసుకోలేదు. రోజుకి మూడు లక్షలకి పైగా కరోనా కేసులు , నాలుగు వేలకి పైగా కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దేశ రాజధాని ఢిల్లీ లో బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకి ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని , ఒక్కోబ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయని, కరోనా మహమ్మారి బాధితులకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ లభించక ఐసీయూల్లో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోందని , దీంతో అమూల్యమైన మరణాలను కోల్పోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైతే, రెండు గంటల్లో తమ బృందం హోం డెలివరీ చేస్తుంద సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, వైద్యులు ఎప్పటికప్పుడు బాధితులను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే.. తక్షణమే తిరిగి చేర్చుకుంటామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. సహాయం కోసం 1031 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. గత కొద్ది వారాల క్రితం ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరగడంతో ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధించింది. ఆ అంశం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆప్ ప్రభుత్వం చెబుతోంది. తాజా చర్యలతో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరడంతో పాటు ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది.