Begin typing your search above and press return to search.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత.. కరోనా రోగులకు పాట్లు
By: Tupaki Desk | 29 Aug 2020 4:00 AM GMTఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 4లక్షలకు చేరింది. ప్రతి ఇంటా కరోనా వస్తుండటంతో ఆస్పత్రులు కిక్కిరిసి పోతున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించడంలో అన్నిటికంటే అవసరమైనది ఆక్సిజన్. వ్యాధితో ఊపిరి తీసుకోలేకున్నా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం వినియోగం పెరగడంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొందరు అక్రమార్కులు ఆక్సిజన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్మి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో రాష్ట్రంలో రోజుకు వెయ్యి కిలోల వరకూ ఆస్పత్రులు ఆక్సిజన్ ను వాడేవి. అయితే ప్రస్తుతం 4 వేల నుంచి 5 వేల కిలోల వరకూ ఆక్సిజన్ ను వినియోగిస్తున్నాయి. విశాఖ కేజీహెచ్లో కరోనా పరిస్థితులకు ముందు నెలకు 80 నుంచి 90 టన్నుల వరకు ఆక్సిజన్ను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రికి 150 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. ఇక్కడ పది వేల కేజీల ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. గతంలో ఒకసారి ట్యాంక్ నిండితే పది రోజులకు పైగా ఆక్సిజన్ సరిపోయేది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే ఖాళీ అయిపోతుంది. దీన్నిబట్టి కరోనా రోగులకు ఏ రేంజ్ లో ఆక్సిజన్ ను ఉపయోగిస్తున్నారో అర్థమవుతుంది. ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు సంస్థలు ధరలు భారీగా పెంచాయి. చాలా ఆసుపత్రులకు సమయానికి ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత గా ప్రభుత్వాన్ని కూడా వేధిస్తోంది. అన్ని ఆస్పత్రులకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయడం సమస్యగా మారింది. బ్లాక్ మార్కెట్ అక్రమార్కులకు చెక్ పెడితేగానీ సమస్య తీరేలా లేదు.