Begin typing your search above and press return to search.

హైదరాబాద్ బ్రాండ్ పై దెబ్బేస్తున్న 'ఓయో'.. నేతలు స్పందిస్తారా?

By:  Tupaki Desk   |   11 Nov 2022 8:52 AM GMT
హైదరాబాద్ బ్రాండ్ పై దెబ్బేస్తున్న ఓయో.. నేతలు స్పందిస్తారా?
X
కొన్ని నెలలుగా హైదరాబాద్ బ్రాండ్ మసకబారుతోంది. డ్రగ్స్ మాఫియా.. పబ్బు కల్చర్ రు హైదరాబాద్ కేరాఫ్ గా మారిందనే విమర్శలను ఎదుర్కొంటుంది. దీనికితోడు నిత్యం ఏదో ఒకచోట హైటెక్ వ్యభిచారం.. సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడుతుండటం నగరవాసులను విస్మయానికి గురి చేస్తోంది.

తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఓయో హోటల్లో వ్యభిచారం చేస్తూ ఒక విదేశీ యువతితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. గతంలోనూ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ బృందం వివిధ బ్యూటీ పార్లర్స్.. హోటల్స్.. ల్యాడ్జిల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాల ముఠాల గుట్టు రట్టు చేసింది.

ఓయో కేంద్రాలు.. హోటళ్లపై ఈ ఏడాదిలో అనేక సార్లు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఓయో కేంద్రాల పని తీరుపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ పద్ధతిలో ఓయో కేంద్రాలు వ్యభిచారాన్ని నిర్వహిస్తుండటంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

పక్కా సమాచారంతో పోలీసులు ఓయో.. ఇతర హోటళ్లు.. ల్యాడ్జిలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తూ సెక్స్ రాకెట్ ముఠాల గుట్టు రట్టు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ దందా మాత్రం ఆగడం పోవడం ఆందోళనను కలిగిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట ఈ సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు అరెస్ట్ అవుతుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

తాజాగా చిన్న అంజయ్య నగర్ ఎంపైర్ ఓయో హోటల్ పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం దాడులు నిర్వహించింది. అక్కడ వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించి ముగ్గురు ఓయో నిర్వాహకులను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు వారిని యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ బృందం అప్పగించింది.

వీరి వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లు.. భారీగా నగదుతో పాటు 38 కండోమ్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పట్టుబడిన ఒక ఉజ్బెకిస్తాన్ యువతి.. ఇద్దరు ఢిల్లీకి చెందిన యువతులు.. పశ్చిమ బెంగాల్ కు చెందిన మరో ఇద్దరు యువతులు.. ముంబై కి చెందిన ఒక యువతికి కౌన్సిలింగ్ నిర్వహించి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు.

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం..ఇకపోతే గత నెలలోనూ పీజేఆర్ నగర్ లోని ఓ హోటల్ లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల యువతులు పట్టుబట్టారు. అయితే తరుచూ ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో వెలుగుచూస్తుండటంతో దీని వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.