Begin typing your search above and press return to search.
శిద్దా ముహుర్తంలో లోపాన్ని చెప్పిన నారాయణ
By: Tupaki Desk | 12 July 2016 6:47 AM GMTఏపీ మంత్రి నారాయణలోని మరో క్వాలిటీ తాజాగా బయటకు వచ్చింది. విద్యావేత్తగా సుపరిచితుడైన ఆయన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా మంత్రిని చేసేయటమే కాదు.. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పజెప్పిన వైనం తెలిసిందే. అమరావతికి సంబంధించిన బాధ్యతల్ని ప్రత్యేకంగా చేపట్టిన ఆయన రాజధాని కోసం వేలాది ఎకరాల్ని రైతుల నుంచి సమీకరించే విషయంలో భారీగానే మార్కులు కొట్టేశారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూసేకరణ.. భూ సమీకరణ లాంటి అంశాల్ని డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో అభ్యంతరాలు.. మరెన్నో నిరసనలు వెల్లువెత్తే పరిస్థితి. వాటిని సముదాయిస్తూ.. పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకుండా భూసమీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయటంలో నారాయణ పాత్రను తక్కువ చేసి చూడలేం.
అలా తన శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శించటం ద్వారా.. రెగ్యులర్ పొలిటీషియన్లకు మించిన మంచి ఆడ్మినిస్ట్రేటర్ నారాయణలో ఉన్నాడన్న భావన కలుగజేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాంటి నారాయణకు ముహుర్తాలు చూసే విషయంలో కూడా పట్టు ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమరావతిలోని వెలగపూడి సమీపంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం ఐదో భవనంలో రెండు శాఖల్ని సోమవారం ప్రారంభించాల్సి ఉంది. ఈ భవనాల్ని రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఓపెన్ చేయాల్సి ఉంది.
మంత్రిగారి చేతుల మీద ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లుకూడా చేసేశారు. అయితే.. మరో మంత్రి నారాయణకు ప్రారంభోత్సవం గురించి తెలిసిన వెంటనే శిద్దాతో మాట్లాడితే.. సోమవారం ముహుర్తం బాగోలేదని.. హస్తా నక్షత్రం.. అష్టమి ఘడియలు ప్రవేశించిన వేళ ప్రారంభోత్సవం చేయకూడదన్న విషయాన్ని వివరించటంతో శిద్దా వెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమ.. మంగళ వారాలు బాగోలేదని.. బుధవారం ముహుర్తం బాగున్న నేపథ్యంలో ఆ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని సూచించటంతో శిద్దా ఓకే అనేశారు. చూస్తుంటే.. మంత్రి నారాయణలో చాలానే ‘విషయం’ ఉన్నట్లుందే.