Begin typing your search above and press return to search.

నారాయ‌ణ కోరిక తీరుతుందా?

By:  Tupaki Desk   |   26 July 2018 4:32 PM GMT
నారాయ‌ణ కోరిక తీరుతుందా?
X
రాజ‌కీయాల్లో కొన్ని సార్లు ఆస‌క్తిక‌ర - అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతుంటాయి. 2014కు ముందు అస‌లు రాజకీయాలతో సంబంధంలేని ఓ ఏపీ పారిశ్రామిక వేత్త‌.....నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే....ఏకంగా టీడీపీ స‌ర్కార్ లో కీల‌క మంత్రిత్వ శాఖ‌ను చేపట్టారు. అంతేకాకుండా - అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ‌లో కీల‌క భూమిక పోషించారు. అయితే - ఇంత చేసినా.... ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని లోటు ఆయ‌న‌కు ఉంద‌ట‌. అందుకే ఆ లోటు తీర్చుకునేందుకు 2019లో రంగంలోకి దిగేందుకు ఆ నేత సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు....ఏపీ మునిసిప‌ల్ శాఖ మంత్రి పి. నారాయ‌ణ‌. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ‌....నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే, అక్క‌డ మ‌రో న‌లుగురు నేత‌లు కూడా ఆ టికెట్ ఆశిస్తుండ‌డంతో నారాయ‌ణ‌కు గ‌ట్టిపోటీ త‌ప్పేలా లేద‌ని తెలుస్తోంది.

నెల్లూరులో నాలుగు స్తంభాలాట న‌డుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ సీటు కోసం ప్ర‌య‌త్నిస్తోన్న నారాయ‌ణ‌కు న‌లుగురు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. మేయ‌ర్ అబ్డుల్ అజీజ్ - మాజీ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ రెడ్డి - నుడా చైర్మ‌న్ కోటం రెడ్డి శ్రీ‌ర‌నివాసులు - మాజీ మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ తాళ్ల‌పాక అనురాధలు కూడా నెల్లూరు సిటీ టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీలో మైనారిటీ కోటాలో గెలిచిన అజీజ్...మేయ‌ర్ గా ప‌దవి చేప‌ట్టారు. 30 వేల ముస్లిం ఓటు బ్యాంకు ఉంద‌న్న ధీమాతో అజీజ్ టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ చేతిలో ఓట‌మి పాలైన శ్రీ‌ధ‌ర్ రెడ్డి...ఈ సారి టికెట్ ఖాయ‌మ‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. మ‌రోవైపు, బాల‌క్ష‌ష్ణ వీరాభిమాని అయిన నుడా చైర్మ‌న్....శ్రీ‌నివాసులు కూడా టికెట్ పై ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌తంలో లాగే ఈసారికూడా బాల‌య్య అండ‌తో టికెట్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మాజీ మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ తాళ్ల‌పాక అనురాధ కూడా టికెట్ పై గంపెడాశ‌లు పెట్టుకున్నార‌ట‌. అయితే, నెల్లూరు సిటీ కుద‌ర‌క‌పోతే...రూర‌ల్ కు పోదామ‌ని నారాయ‌ణ ఆలోచ‌న‌ట‌. కానీ, ఆదేల ప్ర‌భాక‌ర్ రెడ్డికి రూర‌ల్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో, తిరుప‌తి నుంచి అయినా పోటీ చేయాల‌ని నారాయ‌ణ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది.