Begin typing your search above and press return to search.
నారాయణ నంద్యాలలో దిగిపోయారు...
By: Tupaki Desk | 28 Jun 2017 6:22 AM GMTనంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిన తక్షణ అవసరం ఉండడంతో టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు అందుకోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు దీనిపై స్పష్టమైన ఆరోపణలు కూడా చేస్తున్నాయి. రాష్ర్టంలో ముందస్తు ఎన్నికలకు రావాలని చంద్రబాబు అనుకుంటున్న తరుణంలో నంద్యాలలో కనుక ఓడిపోతే అది దారుణమైన నష్టం కలిగిస్తుందని.. అందుకే ఎంత ఖర్చు చేసైనా సరే ఈ ఎన్నికలో గెలవాలని టీడీపీ అనుకుంటోందని... అందుకోసం మంత్రి నారాయణను రంగంలోకి దించారని వైసీపీ ఆరోపిస్తోంది.
కాగా మంత్రి నారాయణ ఇప్పటికే నంద్యాలలో తిష్ట వేసి తన పథకాలు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీగా నగదును అక్కడి తరలిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్లు వేయించగలిగే నేతలు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించి కార్లు - ట్రాక్టర్లు వంటి బహుమతులుగా ఇవ్వడానికి స్కెచ్ గీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు నంద్యాల అభివృద్ధిపైనా కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని... అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా నంద్యాలకు ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు 120 రోజుల ప్రణాళిక అంటూ ఓటర్లకు బొమ్మ చూపిస్తోందని అంటున్నారు. మరోవైపు 5 వేల కుట్టు మిషన్ల పంపిణీకి అంతా రెడీ చేశారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/