Begin typing your search above and press return to search.

డేట్‌.. టైం.. ప్లేస్ ఫిక్స్‌

By:  Tupaki Desk   |   23 May 2015 2:04 PM GMT
డేట్‌.. టైం.. ప్లేస్ ఫిక్స్‌
X
ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి అత్యంత ముఖ్య‌మైన భూమిపూజ‌కు సంబంధించిన వివ‌రాలు అధికారిక‌మ‌య్యాయి. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాప‌నను జూన్ ఆరున చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించినా.. ఎక్క‌డ చేస్తున్నారు? ఎన్ని గంటల స‌మ‌యానికి అన్న విష‌యాల‌పై బోలెడంత సందేహం ఉంది.

అయితే.. జూన్ ఆరున చేసేది శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం కాద‌ని.. కేవ‌లం భూమి పూజ మాత్ర‌మేన‌ని మంత్రి నారాయ‌ణ చెబుతున్నారు. ఇక‌.. ముహుర్తం విష‌యానికి వ‌స్తే.. జూన్ ఆరో తేదీ ఉద‌యం 8.49 గంట‌ల‌కు భూమిపూజ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు.
ఇక‌.. భూమిపూజ జ‌రిపే ప్రాంతం విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజీకి.. బోరుపాలెంకు మ‌ధ్య 8.5కిలోమీట‌ర్ వ‌ద్ద ఈ భూమిపూజ చేయ‌నున్నారు. అయితే.. ఈ ముహుర్తం ప‌ట్ల ప్ర‌ముఖ జ్యోతిష్యుడు శ్రీ‌నివాస గార్గేయ బాగోలేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. పండితులు పెట్టిన ముహ్తుర్తంలోనే భూమి పూజ జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. తాజా స‌మాచారంతో ఏపీ రాజ‌ధాని నిర్మానానికి నాందిగా భావించే భూమిపూజ‌కు సంబంధించిన అన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లే.