Begin typing your search above and press return to search.
పదవి సుజనాది.. రాజీనామా ప్రతిపాదన నారాయణది
By: Tupaki Desk | 8 Feb 2018 5:25 PM GMTకేంద్రంపై పోరుతో ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ ఎంపీలు - ఏపీ మంత్రులను అడిగితే పైకి వారంతా రాష్ర్టప్రయోజనాలు అని చెప్తే చెప్పొచ్చు కానీ, వారిలో సగంమందికి లోలోన మరో కోరిక ఉందట. ఈ వేడిలోనే ఏదో ఒకటి చేసి చంద్రబాబును రెచ్చగొట్టి సుజనా చౌదరి ఊడగొట్టాలని కొందరు ఎంపీలు - టీడీపీ సీనియర్లు ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే మొన్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ చంద్రబాబు వద్ద కేంద్ర మంత్రుల రాజీనామా ప్రతిపాదనను పెట్టడంతో పాటు బాబు వద్దన్నా కూడా పదేపదే అదే అంశాన్ని కొందరు ప్రస్తావించినట్లు తెలిసింది.
తాజాగా ఏపీ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఆయన... చంద్రబాబు ఆదేశిస్తే రాష్ర్టప్రయోజనాల కోసం సుజనాచౌదరి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సుజనా నిజంగా ఆ మాట చెప్పారో లేదో కానీ నారాయణ మాత్రం ఆయన్ను ఇరుకునపెట్టేలా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులున్నారు. అందులో ఒకరైన అశోక్ గజపతి రాజు ఇప్పటికే బీజేపీతో బాగా టచ్‌లో ఉన్నారని టాక్. అయితే.. ఆయన పదవులు - హోదా వంటి వాటి కోసం పెద్దగా పాకులాడే రకం కాదు. పదవులను అడ్డంపెట్టుకుని ప్రయోజనాలు పొందే రకమూ కాదు. సో... ఆయన్ను టార్గెట్ చేసేవారూ ఎవరూ ఉండరు. కానీ, సుజనాపై మాత్రం పార్టీలో చాలామందికి మంట ఉంది. పార్టీలో ఆయన ఎదుగుదల ముఖ్యంగా చాలామందికి నచ్చదు. చంద్రబాబు ఆయన్ను అమాంతం కేంద్ర మంత్రిని చేయడం గిట్టనివారున్నారు. ఆయన ఆ పదవిలో ఉంటూ మరింత బలపడడమూ టీడీపీ నేతల్లో చాలామందికి నచ్చదు. ఈక్రమంలోనే కేంద్రంతో కయ్యాన్ని అడ్డంపెట్టుకుని సుజనాతో రాజీనామా చేయించాలని చాలామంది ప్రయత్నిస్తున్నారట.