Begin typing your search above and press return to search.

ఆటతోపాటు ఆదాయం.. సింధూనే టాప్..

By:  Tupaki Desk   |   8 Aug 2019 8:12 AM GMT
ఆటతోపాటు ఆదాయం.. సింధూనే టాప్..
X
ఎంత సేపు రోనాల్డో ఆదాయం ఇంత.. కోహ్లీ ఆదాయం ఇన్ని కోట్లు అని లెక్కలేసుకోవడమేనా? మన మహిళా క్రీడాకారులను పట్టించుకోరా? వారి ఆదాయంపై లెక్కలు వేయరా.? అసలు వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో గుర్తించరా అని ఆవేశపడే వాళ్లు ఉన్నారు. ఇప్పుడు వారి కోరికను తీరుస్తోంది ‘ఫోర్బ్’ సంస్థ.

తాజాగా ఫోర్బ్స్ సంస్థ 2019 మహిళా అథ్లెట్ల సంపాదనను లెక్కగట్టి ఎవరు ఎంత ఆర్జిస్తున్నారో తెలియజేసింది. ఇందులో మన తెలుగమ్మాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏకంగా ప్రపంచంలోనే 13వ స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి 15మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్నది టెన్సిస్ స్టార్ సెరెనా విలయమ్స్. ఈమె ఆదాయం ఏకంగా రూ.207 కోట్లు. ఇక రెండో స్థానంలో నవోమి ఒసాక (172 కోట్లు), ఏంజెలికా కెర్బర్ (84 కోట్లు) లున్నారు. వీరు టెన్నిస్ క్రీడాకారులే కావడం విశేషం.

ఇక తెలుగమ్మాయి.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏం తక్కువ తినలేదు. ఈమె ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న మహిళా క్రీడాకారుల్లో ఏకంగా 13వ స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె ఏకంగా ఏడాదికి రూ.39 కోట్లు సంపాదిస్తోంది.సింధూ మినహా ఏ భారత క్రీడాకారిణి ఇంత ఆదాయంతో ఆమె దారిదాపుల్లో లేరు. ఫోర్బ్స్ జాబితాలో ఎవరికీ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. సింధూనే వన్ అండ్ ఓన్లీ భారత క్రీడాకారిణి.సింధూకు టోర్నీలు గెలవడం ద్వారా వచ్చిన ప్రైజ్ మనీగా 3.50 కోట్లు, ప్రకటనలు, ఎండార్ఫ్ మెంట్ల ద్వారా రూ.35.50 కోట్లు ఆదాయం పొందుతోందని ఫోర్బ్స్ ప్రకటించింది.