Begin typing your search above and press return to search.
ఢిల్లీ గెలిచి ప్లే ఆఫ్స్ లో నిలిచింది.. బెంగళూరునూ నిలిపింది
By: Tupaki Desk | 3 Nov 2020 2:45 AM GMTచావో రేవో లాంటి మ్యాచ్ లో ఢిల్లీ గర్జించించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై చక్కటి విజయం సాధించి నేరుగా ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో టాప్ -2కు కు చేరుకుంది. కీలకమైన మ్యాచ్ లో బెంగళూరు ఓడినప్పటికీ కోల్ కతా కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం తో బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్ కు చేరింది. సీనియర్ బ్యాట్స్ మెన్లు ధావన్, రహానే అర్ధ సెంచరీలు సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు.ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (50), డివిల్లీర్స్ (35) రాణించారు. కెప్టెన్ గా కచ్చితంగా నిలవాల్సిన మ్యాచ్ లో కోహ్లీ (29) పరుగులకే వెనుదిరిగాడు.ఓపెనర్ ఫిలిప్ (12) , దూబే (17) పరుగులు చేయగా మోరిస్ (0) డకౌట్ అయ్యాడు.దీంతో ఆర్‌సీబీ 152 పరుగులు చేసి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఢిల్లీ బౌలర్లలో నోకియాకు మూడు, రబాడకు రెండు వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ధవన్ (54) అర్ధసెంచరీతో మరోసారి గర్జించగా రహానె కీలక సమయంలో ఫామ్ అందుకుని చక్కటి అర్ధ సెంచరీ (60) చేశాడు. పృథ్వీ షా (9), కెప్టెన్ అయ్యర్ (7), విఫలం అయ్యారు. చివర్లో రహానే ఔట్ అవగా మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నోకియాకు దక్కింది.
పడిక్కల్ అర్ధ సెంచరీల రికార్డ్
ఈ టోర్నమెంట్ లో ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తూ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ బెంగళూరు బెంగ తీర్చాడు. మరోసారి కీలక మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నాడు.అరంగేట్రం సీజన్‌లోనే ఎక్కువ అర్ధసెంచరీ (5)లు.. ఎక్కువ పరుగులు (471) సాధించిన భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా దేవ్‌దత్ రికార్డు సృష్టించాడు.