Begin typing your search above and press return to search.
భార్య అంత్యక్రియలకు డబ్బుల్లేని మొగలయ్య లోకానికి ఎలా తెలిశాడు?
By: Tupaki Desk | 26 Jan 2022 5:40 AM GMTఅత్యున్నత స్థానానికి అందరూ ఉత్తినే చేరుకోలేరు. అందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరికొందరికి విధి పరీక్షల మీద పరీక్షల్ని పెడుతూ ఉంటుంది. వాటిని ఎదుర్కొంటూ.. సవాళ్లకు కుంగిపోకుండా.. తనను తాను నిరూపించుకునే వారికిఒక రోజు కాకుంటే ఒకరోజు గుర్తింపు లభిస్తుంది. ఈ వాదనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు దర్శనం మొగులయ్య. ఇప్పుడీరోజున పద్మశ్రీ పురస్కారాన్నిప్రభుత్వం ప్రకటించింది. అంతకు ఆర్నెల్ల ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో పాట పాడే అవకాశం రావటంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారింది.
ఆయనకు ఇప్పుడు 68 ఏళ్లు. ఇన్నాళ్లు ఆయన జీవితంలో కష్టపడిందే తప్పించి సుఖపడింది లేదు.ఉండేందుకు సరైన ఇల్లు లేని ఆయన ఉండేది హైదరాబాద్ లోని సైదాబాద్ కు సమీపంలోని సింగరేణి కాలనీలోని గుడిసెల్లోని ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఆవుసలకుంట. వారి తాత ముత్తాతల నుంచి వంశపార్యంపరంగా కొనసాగిస్తున్న 12 మెట్ల కిన్నెరవాయిద్య కళనే మొగులయ్య నమ్మకున్నాడు. ఆయనకు ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు కిన్నెర సాధన మొదలు పెట్టాడు.
ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎనిమిదేళ్ల క్రితం జీవనం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అయినా అతడి కష్టాలు తీరలేదు. రెండేళ్ల క్రితం భార్య శంకరమ్మఅనారోగ్యంతో చనిపోతే.. ఆమె దహన సంస్కారాలకు అవసరమైన డబ్బులు లేని పరిస్థితి. తీవ్ర ఇబ్బందుల నడుమ దహన సంస్కారాల్ని పూర్తి చేశాడు. రెండో కొడుకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఇంటికే పరిమితయ్యాడు. కిన్నెర వాయిద్య కళలో అతని నేర్పునకు చాలా ఆలస్యంగా గుర్తింపు లభించింది.
కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దమడూరుకు చెందిన డాక్టర్ రంగయ్య పీహెచ్ డీ కోర్సులో భాగంగా మొగులయ్యయ జీవిత చరిత్రను పబ్లిష్ చేశారు. దీంతో.. అతడి గురించి తొలిసారి బయట ప్రపంచానికి తెలిసింది. మొగులయ్యను ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారం అందజేసింది. అంతేకాదు.. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో మొగులయ్య జీవితాన్ని పాఠంగా పెట్టారు. అలా బయటకు వచ్చిన ఆయన జీవితకథ.. పవన్ కల్యాణ్ కళ్లల్లో పడటంతో అతడి దశ.. దిశ మొత్తంగా మారిపోయింది. పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్న విషయం తెలిసినంతనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. కిన్నెర వాయిద్యాలను తయారు చేసి కళాకారుల్ని తయారు చేస్తానని చెప్పాడే కానీ.. సరైన ఇంట్లోకి మారతానని మాత్రం మాట వరుసకు చెప్పక పోవటం గమనార్హం.