Begin typing your search above and press return to search.
కమల్ పార్టీకి పద్మప్రియ గుడ్ బై !
By: Tupaki Desk | 14 May 2021 3:30 PM GMTకమల్ హాసన్ .. మక్కల్ నీది మయం(ఎంఎన్ ఎం) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే తాజాగా ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మక్కల్ నీది మయం పార్టీ నుండి బరిలో నిలిపాడు. కానీ, రాష్ట్రంలో డీఎంకే , అన్నాడీఎంకే హవా ముందుకు ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయాడు కమల్ హాసన్. కనీసం కమల్ హాసన్ రెండు నిజయోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక్క చోట గెలవలేకపోయాడు. మొత్తంగా మక్కల్ నీది మయం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో డీఎంకే స్పష్టమైన మెజారిటీ తో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే పార్టీ పెట్టినప్పటి నుండి కమల్ హాసన్ కి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నా ఒక్కొక్కరు పార్టీ నుండి బయటకి వెళ్లిపోతున్నారు.
తాజాగా కమల్ హసన్ కి మరో షాక్ తగిలింది. మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి పద్మప్రియ, సంతోష్‌బాబులు వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎంఎన్ ఎంలో చేరి మధురవాయల్ నియోజక వర్గం నుంచి పోటీచేసిన పద్మప్రియ, తాను పార్టీ సాధారణ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తన పట్ల ప్రేమ చూపి ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎంఎన్ ఎం ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు కూడా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సంతోష్‌బాబు మాజీ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం.