Begin typing your search above and press return to search.
పద్మినీ రెడ్డి యూటర్న్... ఎందుకంటే!!
By: Tupaki Desk | 11 Oct 2018 5:16 PM GMTకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇంట్లో ఒకే రోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దామోదర్ రాజనరసింహ భార్య పద్మినిరెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించి అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. తద్వారా ఒకేరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం బీజేపీ రాత్రి తిరిగి కాంగ్రెస్ అన్నట్లుగా పద్మినీ రెడ్డి పయనం సాగింది. రాజకీయాల్లో ఇలాంటి చిత్రమైన ట్విస్టులు కూడా ఉంటాయా అనే చర్చ మొదలైంది.
ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మెన్ సతీమణి పద్మినీరెడ్డికి కమలం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దామోదర పద్మినిరెడ్డి బీజేపీలో చేరడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ బీజేపీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న నమ్మకంతోనే బీజేపీలో చేరానని తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రగతి బాటన నడుస్తోంది అని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం పట్ల పద్మినీ రెడ్డి నమ్మకాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ వర్గాలు షాక్ కి గురయ్యాయి. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అనంతరమే ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటున్నట్లు సంగారెడ్డిలో ప్రకటించారు. కార్యకర్తల మనోభావాలను అర్ధం చేసుకుని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మూడే ముక్కల్లో తన విలేకరుల సమావేశం ముగించడం గమనార్హం.
కాగా, ఈ ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికే సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే రాజనర్సింహతో పాటు ఆమె భార్య పద్మినీ రెడ్డికి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో.. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారని వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పద్మినీ రెడ్డి.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారని తెలియడంతో.. దామోదర రాజనర్సింహ బిత్తరపోయి గజ్వేల్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. అనంతరం ఈ విలేకరుల సమావేశం జరిగింది.