Begin typing your search above and press return to search.
ప్రియాంక ఇగో హర్ట్ అయ్యింది
By: Tupaki Desk | 17 April 2016 9:41 AM GMTదేశం మీద పెత్తనం చేసే హక్కు తమ ఫ్యామిలీకే ఉందన్నట్లు వ్యవహరించే గాంధీ ఫ్యామిలీకి చెందిన ప్రియాంకమ్మ ఇగో హర్ట్ అయ్యింది. భావి కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఆమె సరిపోతుందని కలలు కనేవారు చాలామందే ఉన్నారు. తమ యువరాజు చేయలేని పనిని.. ప్రియాంక పూర్తి చేస్తారని భావించే వారు కాంగ్రెస్ లో ఎక్కువ మందే ఉన్నారు. రాహుల్ హయాంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బ తిందని.. కాంగ్రెస్ కు పూర్వవైభవానికి ప్రియాంక రంగంలో దిగటం మినహా మరో మార్గం లేదని వాదించే వారు లేకపోలేదు.
అలాంటి ప్రియాంకమ్మ.. ప్రభుత్వం కేటాయించిన ఇంటి అద్దెకు సంబంధించి గీసులాడి తగ్గించుకున్న వైనం తాజాగా బయటకు రావటం తెలిసిందే. దాదాపు 14ఏళ్ల క్రితం వాజ్ పేయ్ హయాంలో కేటాయించిన ఇంటికి ప్రభుత్వం నిర్ణయించిన అద్దె మొత్తాన్ని తాను చెల్లించలేననటం.. దీనిపై పాజిటివ్ గా రియాక్ట్ అయిన నాటి కేంద్ర సర్కారు ప్రియాంక ఇంటి అద్దెను తగ్గిన వైనం రావటంపై ప్రియాంక స్పందించింది.
ప్రియాంకమ్మ లాంటి వారు సైతం ఇంటి అద్దె విషయంలో బేరమాడతారా? అన్న విస్మయం వ్యక్తం కావటం లాంటివి ఆమె ఇగోను హర్ట్ చేసినట్లున్నాయ్. అందుకే కాబోలు.. తానేమీ అద్దె తగ్గించాలని బీజేపీ సర్కారును దేబిరించలేదన్నారు. తాను ప్రైవేటు నివాసంలో ఉంటే.. భద్రతా కారణాల దృష్ట్యా నాటి ప్రభుత్వమే తనను ఇల్లు మారాలని చెప్పిందని.. ప్రభుత్వం చెప్పిన ధరను తాను చెల్లించినట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇన్ని మాటలు చెప్పిన ఆమె.. అద్దె తగ్గించాలంటూ తాను కోరిన విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం.