Begin typing your search above and press return to search.
పాక్ - అఫ్గాన్ మ్యాచ్ : స్టేడియం లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ !
By: Tupaki Desk | 30 Oct 2021 6:36 AM GMTటీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. పాక్ బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరును కనబరచడంతో పాక్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆఫ్గనిస్తాన్ ఇచ్చిన 148 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. మ్యాచ్ సంగతి ఇలా ఉంటే .. మ్యాచ్ జరిగే ముందు , జరిగే దుబాయ్ లోన్ స్టేడియం ముందు రచ్చ రచ్చ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్లకు చెందిన ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా విడిపోయి స్టేడియంలోనే బాహాబాహీకి దిగారు. బౌండరీ లైన్‌కు అతి సమీపంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ చూడటానికి భారీగా ప్రేక్షకులు తరలి వచ్చారు. రాత్రి జరగాల్సిన మ్యాచ్ కోసం మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే భారీగా చేరుకున్న అఫ్గాన్ ఫ్యాన్స్ స్టేడియంలోనికి చొరబడటానికి ప్రయత్నించారు. వారి వద్ద టికెట్లు లేకపోయినా గేట్లు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దుబాయ్ పోలీసులు, స్టేడియం సెక్యూరిటీ వీరిని నిలువరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ముందుగానే స్టేడియం గేట్లు మూసేశారు.
దీనితో టికెట్లు ఉన్నా లోనికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. పదుల సంఖ్యలో టికెట్లు కలిగిన ఫ్యాన్స్ లోపలకు వెళ్లలేకపోయారు. భారీగా చేరిన వారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. గేట్లు దూకి మరీ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ రసాభసగా మారింది. సెక్యూరిటీ, దుబాయ్ పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోయారు. టికెట్లు లేని వారిని అక్కడి నుంచి తరిమేయడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో టికెట్లు ఉన్న వాళ్లు కూడా మ్యాచ్ చూడకుండానే వెనక్కి వెళ్లిపోయారు.
లోపలకు ఎంటర్ అయిన ఫ్యాన్స్‌లో చాలా మంది రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగారు. బౌండరీ లైన్‌కు దగ్గరగా ఉన్న స్టాండ్స్‌లో కూర్చున్ అఫ్గాన్-పాక్ ఫ్యాన్స్ బాహాబాహీకి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సెక్యూరిటీ వారిని విడదీసి దుబాయ్ పోలీసులకు అప్పగించింది. పదుల సంఖ్యలో ఫ్యాన్స్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తానికి ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగానే ఇలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సెక్యూరిటీ. దుబాయ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.