Begin typing your search above and press return to search.
సరిహద్దుల్లో చైనా ఆర్మీకి పాక్ సాయం?
By: Tupaki Desk | 4 Oct 2020 5:30 PM GMTభారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా చేస్తున్న కుట్రలు తాజాగా బయటపడుతున్నాయి. పర్వతమయమైన హిమాలయాల్లో భారత సైనికులను ఎదుర్కోలేక చైనా దేశం పాకిస్తాన్ సైనికుల సహాయం తీసుకుంటున్నట్టు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కథనాలకు బలాన్ని ఇచ్చేలా ఓ వీడియో బయటకు వచ్చింది. అదిప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా చైనాకు చెందిన సీజీటీఎన్ న్యూస్ ప్రొడ్యూసర్ షెన్ సీవీే ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేశారు. 52 సెకన్ల ఆ వీడియోలో అందరూ చైనా సైనికుల మధ్య ఒక సైనికుడు మాత్రం డిఫెరెంట్ గా గడ్డంతో పొడుగ్గా కనిపించాడు. అతడు ఎవరనేది విశ్లేషించిన సైనిక నిపుణులు.. ఆ వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలోని ఎస్ఎస్జీ కమాండో అని ఘంఠాపతంగా చెబుతున్నారు. దీన్ని బట్టి హిమాలయ పర్వత సరిహద్దుల్లో చైనాకు పాకిస్తాన్ సాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. చైనాకు సాయం చేసేందుకు పాకిస్తాన్ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచంలోనే పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయగల సైనికులు ఏ దేశానికి లేరు. అమెరికా, రష్యా, ఐరోపా దేశాల్లోనూ భారత్ అంత శక్తిమంతమైన మౌంటేన్ వార్ఫేర్ బృందం లేదని పేర్కొన్నారు. భారత్ అత్యంత ఎత్తులో మంచుకొండల్లోని సియాచిన్ లో సైతం సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకుచైనా సైనిక నిపుణులే ‘మోడర్న్ వెపనరీ’ పత్రికలో రాసుకొచ్చారు.
పాకిస్తాన్ దళాలకు సైతం సియాచిన్, హిమాలయాల్లో భారత్ ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సైనిక సహాయాన్ని కోరినట్టు తెలుస్తోంది. పీఎల్ ఏలో పాక్ ఆర్మీ చైనాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు తాజాగా వీడియోలో స్పష్టమైంది.

Here, we met with Chinese #PLA warriors along #China #India LAC.
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) October 3, 2020
Maybe some of them were standing at the #GalwanValley. pic.twitter.com/KYMMWYD5KI