Begin typing your search above and press return to search.
ఉగ్రవాదుల సరికొత్త ఎటాకింగ్... దాడుల్లో కొత్త ప్లాన్..
By: Tupaki Desk | 26 Sep 2019 10:16 AM GMTఉగ్రవాదులు భారతదేశం పై దాడులు చేసేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయుధాలతో భారత్ పై ఎటాక్ చేసిన ఉగ్రవాదులు ఇప్పుడు పాకిస్తాన్ కనుసన్నల్లో నడుస్తూ ఆధునిక టెక్నాలజీ సహకారంతో మరణ హోమాన్ని సృష్టించేందుకు రెడీ అవుతున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు వెల్లడించారు. ఇటీవల పాక్ సరిహద్దు నుంచి మనదేశంలోని పంజాబ్ రాష్ట్ర సరిహద్దులో ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లోనే పాక్ భూభాగం వైపు నుంచి గ్రెనేడ్లు - ఏకే-47 వంటి మారణాయుధాలను డ్రోన్ల సహకారంతోనే మన దేశం వైపునకు ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాడుల విషయంలో మామూలుగానే ఎటాక్ చేస్తోన్న ఉగ్రమూకలు ఇప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉగ్రవాదులు ఒక్కసారి ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం మొదలు పెడితే... దానిని మరింత మెరుగు పరుచుకుని దేశంలో ఏ ప్రాంతంలో అయినా డ్రోన్లతో ఎటాక్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై కొద్దిరోజుల కిందట దాడులు చేయడానికి ఈ డ్రోన్లనే వినియోగించారు. ఇప్పుడు భారత్ మీద దాడులు చేసేందుకు అదే తరహా టెక్నాలజీని వాడుతున్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం చెబుతోంది. చైనాలో తయారు చేసినట్టుగా ఈ డ్రోన్లు పంజాబ్ రాష్ట్రం సరిహద్దు వరకు భారీ సామాగ్రిని సైతం మోసుకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ డ్రోన్లు పెద్ద పెద్ద సామాగ్రిని సైతం అవలీలగా మోసేస్తాయంటున్నారు. వీటితోనే పాక్ వైపు నుంచి మనదేశంలో సరిహద్దు గ్రామాలపై గ్రేనేడ్లతో దాడులు చేశారని సందేహాలు ఉన్నాయి. ఈ డ్రోన్లతోనే దేశ రాజాధాని ఢిల్లీపై సైతం ఎటాక్ చేసే అవకాశాలు కొట్టిపడేయలేం అని ఇంటిలిజెన్స్ హెచ్చరిస్తోంది. ఇటీవల జైషె మహమ్మద్ - లష్కరే తొయిబా వంటి సంస్థల సానుభూతిపరులుగా ఉన్న కొందరిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకోగా వారి సోషల్ మీడియాలో డ్రోన్లతో ఎలా దాడులు చేయాలో చాలా సమాచారం పొందు పరిచి ఉన్నట్టు గుర్తించారు.
దీనిని బట్టి చూస్తే ఉగ్రవాదులు ఎంతకు అయినా తెగించేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఎలెర్ట్ అయ్యారు. రాజధానిలో డ్రోన్లు ఎక్కడ కనిపించినా... అనుమానంగా ఎగురుతున్నట్టు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1500 మీటర్ల వరకు డ్రోన్లను ఎగరవేయడంపై ఇప్పటికే నిషేధం కూడా విధించారు.