Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్.. ఇప్పుడిదే ట్రెండింగ్

By:  Tupaki Desk   |   3 March 2019 12:14 PM GMT
ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్.. ఇప్పుడిదే ట్రెండింగ్
X
పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శాంతి స్థాపనలో భాగంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాము శాంతి కాముకలమని.. శాంతిని కోరుకున్నాం కాబట్టే విడుదల చేస్తున్నామని ఇమ్రాన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ నిర్ణయంపై పాకిస్తాన్ లోనే కాదు.. భారత్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

భారత సైనికుడి విడుదల విషయంలో ఎంతో ధైర్యంగా.. శాంతి స్థాపన కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయడంపై పాకిస్తాన్ ప్రజల నుంచి గొప్ప స్పందన వస్తోంది. వెంటనే ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. తాజాగా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి జాతీయ పార్లమెంట్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ కు వెంటనే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంట్ లో ప్రతిపాదించగా ఎంపీలందరూ ముక్తకంఠంతో దీనికి సపోర్టు చేశారు.. ఇమ్రాన్ ధృడమైన నిర్ణయం వల్లే అభినందన్ విడుదలయ్యాడని.. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సమసి శాంతి చేకూరిందని మంత్రి ఫవాద్ అభిప్రాయపడ్డారు.

అందువల్ల నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ అర్హుడంటూ మంత్రి ఫవాద్ తీర్మానించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తాయో లేదో తెలియదు. కానీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఇప్పుడు ట్విట్టర్ లో నోబెల్ శాంతి బహుమతి ఇమ్రాన్ కు ఇవ్వాలంటూ హాష్ ట్యాగ్ తో పెద్ద పోరాటం చేస్తున్నారు. చాలా మంది దీన్ని వైరల్ చేస్తూ సపోర్టు చేస్తున్నారు.