Begin typing your search above and press return to search.
ఓడిన పాక్ పై అభిమాని కన్నీళ్లు.. వీడియో వైరల్
By: Tupaki Desk | 17 Jun 2019 10:33 AM GMTఇండియా-పాకిస్తాన్ ప్రపంచకప్ క్రికెట్ పోటీ.. ఈ రెండు దేశాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన పోటీ ఇదీ.. ఇలాంటి సమరంలో పాకిస్తాన్ ఓడిపోయింది. భారత్ మరోసారి ఆ టీంపై విజయం సాధించింది. అయితే వర్షం వల్ల అంతరాయం కలిగి చివరకు భారత్ చేతిలో చిత్తైన పాకిస్తాన్ టీంపై ఇప్పుడు ఆ దేశ అభిమానులు, ప్రజలు మండిపడుతున్నారు.
తాజాగా టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ టీంపై ఆ దేశ అభిమాని మాట్లాడిన వీడియో ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్లను తిట్టిపోస్తున్నారు. ఓ వైపు భారత్ విజయంతో భారత అభిమానులు పండుగ చేసుకుంటుండగా.. పాక్ అభిమానులు మాత్రం వారి టీంపై దుమ్మెత్తి పోస్తున్నారు..
తాజాగా ఓ అభిమాని పాక్ ఓడిపోయాక ఇంగ్లండ్ లోని స్టేడియం బయట విలేకరులతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. పాకిస్తాన్ ఓటమిని చూడలేక వర్షం వచ్చి అయినా మ్యాచ్ రద్దు అవుతుందని చూశామని.. కానీ వరుణ దేవుడు కూడా మాపై దయచూపలేదని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. మా పాకిస్తాన్ టీం తిండి తినడం మీదే చూపే శ్రద్ధ.. ఫిట్ నెస్, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేదని.. పిజ్జాలు, బర్గర్లు తింటారు తప్ప మైదానంలో ఆడలేరని.. ఓ పాకిస్తాన్ అభిమాని ఏడుస్తూ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.
అతడు ఏడుస్తుండగా.. పక్కనే ఉన్న వ్యక్తి అతని భుజం తడుపుతూ.. పాక్ జాతీయ జెండాతో కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్చాడు. ఇలా పాక్ అభిమాని అతడి టీంపై చేసిన విమర్శలు ట్విట్టర్ లో తెగ సందడి చేస్తున్నాయి.

For Video Click Here