Begin typing your search above and press return to search.

తెలుగు మత్స్యకారుల విడుదలకి పాక్ గ్రీన్ సిగ్నల్ !

By:  Tupaki Desk   |   3 Jan 2020 11:10 AM GMT
తెలుగు మత్స్యకారుల విడుదలకి పాక్ గ్రీన్ సిగ్నల్ !
X
గత కొద్ది నెలలుగా పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదలకు పాక్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వారి విడుదల కోసం వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి అని చెప్పాలి. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నెల 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ భారత్ కి అప్పగించనుంది. మత్స్యకారుల జాబితాను పాక్‌ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ కు పంపించింది.

కాగా , పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్‌లో పొరపాటున గుజరాత్‌ తీరం వద్ద పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించడం తో పాకిస్తాన్‌ వారందరిని అరెస్ట్‌ చేసింది. ఆ సమయంలో సీఎం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర లో ఉంటె , ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, బాధితులు అయన దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్‌ జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు.

అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది. దీనితో ఆ 20 మంది ఆంధ్ర జాలర్ల ను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది.

పాకిస్తాన్‌ విడుదల చేయబోతున్న తెలుగు మత్స్యకారుల జాబితా..

ఎస్‌.కిశోర్‌
నికరందాస్‌ ధనరాజ్
గరమత్తి
ఎం. రాంబాబు
ఎస్‌. అప్పారావు
జి. రామారావు
బాడి అప్పన్న
ఎం. గురువులు
నక్కా అప్పన్న
నక్క నర్సింగ్
వి. శామ్యూల్
కె. ఎర్రయ్య
డి. సురాయి నారాయణన్
కందా మణి
కోరాడ వెంకటేష్
శేరాడ కళ్యాణ్
కేశం రాజు
భైరవుడు
సన్యాసిరావు
సుమంత్‌