Begin typing your search above and press return to search.

హాలీవుడ్, బాలీవుడ్‌లపై పాక్ పీఎం సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   29 Jun 2021 3:30 PM GMT
హాలీవుడ్, బాలీవుడ్‌లపై పాక్ పీఎం సంచలన వ్యాఖ్యలు
X
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎంతమంది పోలీసులని కానీ , ఎన్ని చట్టాలని కానీ తయారుచేసినా కూడా మహిళలపై జరిగే అఘాయిత్యాల్ని అడ్డుకోలేకపోతున్నారు. అయితే , మహిళపై జరిగే అత్యాచారాలకి వారు వేసుకునే దుస్తులు కూడా ఓ కారణమని కొందరు ప్రముఖులు కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మద్యే పాకిస్థాన్ ప్రధాని కూడా మహిళలు వేసుకునే పొట్టి పొట్టి బట్టల వలనే ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలకి మరింత ప్రాధాన్యత కల్పిస్తూ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇస్లామాబాద్‌ లో తాజాగా నేషనల్ అమట్యూర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఘనంగా ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కురచ దుస్తుల కారణంగా మహిళలపై జరుగుతున్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. ఆలోచనలు సరికొత్త పంథాలో ఆవిష్కరించాలి. దానికి సహజత్వం ఉండాలని నేను కోరుకుంటాను. కానీ కొన్ని చోట్ల ఇది విపరీతత్వానికి దారి తీస్తోంది. హాలీవుడ్‌ లో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది క్రమంగా బాలీవుడ్‌కి చేరింది. చివరికి ఆ రెండింటి వల్ల పాకిస్తాన్‌ ప్రభావితమవుతోంది అని అన్నారు. ఈ రెండు సినీ ఇండస్ట్రీల వల్ల పాకిస్తాన్‌ లో అశ్లీలత పెరిగిపోతోందని పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ లో నిర్వహించిన ఓ అవార్డుల కార్యక్రమంలో ఆయన అన్నారు. మహిళల బట్టలు లైంగిక వేధింపులకు ప్రేరేపితం చేస్తుందా అని ఆయనను ప్రశ్నించగా..ఒక మహిళ కురుచ దుస్తులు వేసుకుంటే రోబోట్లను కదిలించలేదేమో కానీ ప్రతి మగాడిపై ఆ ప్రభావం ఉంటుంది అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రచయిత తస్లీమా నస్రీమ్ అయితే చొక్కా లేకుండా ఉన్న ఇమ్రాన్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఒక పురుషుడు కురుచ దుస్తులు వేసుకుంటే రోబోట్లను కదిలించలేదేమో కానీ ప్రతి మహిళపై ఆ ప్రభావం ఉంటుంది అని ట్వీట్ చేశారు.