Begin typing your search above and press return to search.
గిల్గిట్-బాల్టిస్తాన్ ఆక్రమణకు పాక్ ప్లాన్
By: Tupaki Desk | 17 Sep 2020 5:34 PM GMTభారత్ తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్....అందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు. సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగడం మొదలు....చైనాతో కలిసి భారత్ పై కుట్రలు పన్నడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ పైశాచికానందం పొందుతుంటుంది. ఓ పక్క చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగక ముందే దాయాది దేశం మరో కుట్రకు తెరలేపింది. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను అధికారికంగా తమ దేశంలో విలీనం చేసుకునేందుకు పాక్ స్కెచ్ వేసింది. పాక్ లో మేము కలవం మొర్రో అని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రజలు మొత్తుకుంటున్నా పాక్ వినకుండా నియంతపోకడతో వ్యవహరిస్తోంది. గిల్గిట్‌కు పూర్తి స్థాయి ప్రావిన్స్ హోదా ఇచ్చి సెనేట్, నేషనల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించి ఆ ప్రాంతంపై పెత్తనం చలాయించేందుకు పాక్ సిద్ధమైంది.
గిల్గిట్ బాల్టిస్తాన్‌కు రాజ్యాంగబద్దమైన హక్కులతో పూర్తి స్థాయి ప్రావిన్స్‌గా మార్చేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు కశ్మీర్-గిల్గిట్ బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ గందపూర్ వెల్లడించడంతో ఈ చర్చకు తెరలేచింది. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్ బాల్టిస్తాన్‌ను సందర్శించి ఈవిషయంపై అధికారిక ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు.భారత్-పాక్ మధ్య వివాదంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్‌ను హస్తగతం చేసుకునేందుకు 2018లో పాక్ అక్కడ ఎన్నికలకు కూడా సిద్దమైంది. 2020 నవంబర్‌లో ఎలక్షన్ జరిపేందుకు పాక్ సర్కార్ రెడీ అవుతోంది. గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగంలో అంతర్భాగమని భారత్ వాదిస్తోంది. దానిపై పాక్ కు హక్కు లేదని చెబుతోంది. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఎన్నికల నిర్వహణకు పాక్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ ఖండించింది.