Begin typing your search above and press return to search.
రైళ్లలో ఏసీ క్లాసులో సెక్స్ సర్వీస్!
By: Tupaki Desk | 5 Oct 2022 12:30 AM GMTహెడ్డింగ్ చదివి కంగారు పడుతున్నారా.. ఇది నిజం కాదండి.. ఇది పాకిస్థాన్ హ్యాకర్ల పని. పాకిస్థాన్ రైల్వే సాఫ్ట్‌వేర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో ఎవరైనా రైలు టికెట్లు బుక్ చేసుకుంటే వాటిపైన సెక్స్ సర్వీస్ ఇన్ ఏసీ క్లాస్ అని వస్తోంది.
ఇప్పటివరకు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారుల ఆడియోలు, వీడియోలు అంటూ పాకిస్థాన్‌లో ఇటీవల హ్యాకర్లు విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా రైల్వే సాప్ట్‌వేర్ ను హ్యాక్ చేశారు. రైల్వే టికెట్లపై ఉండాల్సిన టికెటింగ్ సిస్టమ్ ను తీసివేశారు. టికెటింగ్ సిస్టమ్ స్థానంలో ఏసీ క్లాసుల్లో సెక్స్ సర్వీస్ అని టెక్ట్సును మార్చారు.
పాకిస్థాన్‌లో లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 'ఏసీ క్లాస్‌లో సెక్స్ సర్వీస్ అందుబాటులో ఉంది' అని పేర్కొన్న టికెట్లను చూసి పాక్ రైల్వే అందిస్తున్న సౌకర్యాలను చూసి షాక్ అయ్యారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
సెప్టెంబరు 30న లోకల్ రైలులో కోట్ అడు నుండి వాహ్ వరకు ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు తన రైలు టికెట్ పై... సెక్స్ సర్వీస్ ఎవాలబుల్ ఇన్ ఏసీ క్లాస్ అని ముద్రించడం చూశాడు. దీంతోకోపోద్రిక్తుడైన ప్రయాణీకుడు బుకింగ్ కార్యాలయానికి చేరుకున్నాడు, అక్కడ అతను టికెటింగ్ సిబ్బందిపై ఇదేమిటంటూ మండిపడ్డాడు. ఈ టికెట్ల వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిందని తెలియజేశాడు.
యువకుడి ఫిర్యాదు తర్వాత థాల్ ఎక్స్‌ప్రెస్ అధికారులు తప్పును గుర్తించారు. తమ సాఫ్ట్‌వేర్ హ్యాక్ అయిందని పేర్కొంటూ రావల్పిండి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ చర్య పాక్ రైల్వే ప్రతిష్టను దెబ్బతీసినందున చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించారు.
ఇప్పటివరకు ఆడియో లీక్స్, వీడియో లీక్స్ అంటూ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సైనికాధికారులను లక్ష్యంగా చేసుకోగా ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.