Begin typing your search above and press return to search.
ఇండియాకు పాక్ హెచ్చరిక.. రానివ్వకపోతే టోర్నీ జరగనివ్వం
By: Tupaki Desk | 23 Feb 2021 1:30 AM GMTటీ20 వరల్డ్ కప్ నిర్వహణ చిచ్చు పెడుతోంది. ఇండియాలో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి తమను రానివ్వకపోతే టీ20 ప్రపంచకప్ 2021 భారత్ లో జరగకుండా చూస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మని అన్నారు.తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్ కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని.. అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ డిమాండ్ చేశారు. ఒకవేల అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్ లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని.. యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు.ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం.. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరామని ఎహసాన్ మని చెప్పుకొచ్చారు.