Begin typing your search above and press return to search.

తగిలిన దెబ్బ కనిపిస్తున్నా.. కొట్టలేదంటుంది!

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:31 AM GMT
తగిలిన దెబ్బ కనిపిస్తున్నా.. కొట్టలేదంటుంది!
X
జ‌ర్జిక‌ల్ దాడులను పాక్ అంగీక‌రించ‌డం లేదు. అలాంటి దాడులేవీ పాకిస్థాన్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో జ‌ర‌గ‌నే లేద‌ని బుకాయిస్తోంది. జ‌ర్జిక‌ల్ దాడుల పేరుతో ఏదో సాధించామ‌ని భార‌త్ క‌ట్టుక‌థ‌లు చెబుతూ ప్ర‌పంచాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని పాక్ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని పాక్ మీడియా కూడా కోడై కూస్తోంది. పాకిస్థాన్‌ కు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు ఎల్.ఒ.సి. ప్రాంతాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ దాడులు జ‌రిగిన ఆన‌వాళ్లే లేవంటూ క‌థ‌నాలు వండి వార్చేశారు. ‘భార‌త్ నాట‌కాలు బ‌ద్ద‌ల‌య్యాయి’ అంటూ ప్ర‌ముఖ ఉర్దూ ప‌త్రిక ‘జంగ్‌’ ప‌తాక శీర్షిక‌లో భారీ క‌థ‌నం ప్ర‌చురించింది. ‘భార‌త్ అస‌త్యాలు వెలుగులోకి వ‌చ్చాయి’ అంటూ మ‌రో ప‌త్రిక ‘ఉమ్మాత్‌’ హెడ్‌లైన్స్ పెట్టేసింది. ప్ర‌ముఖ ఆంగ్ల దిన ప‌త్రిక ‘ద ఎక్స్‌ ప్రెస్ ట్రిబ్యూన్’ కూడా ‘భార‌త్ అబ‌ద్ధాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన జ‌ర్న‌లిజం’ అంటూ క‌థ‌నాలు వండి వార్చింది.

దీంతో పాకిస్థాన్ ఆలోచ‌న ఏంటో స్ప‌ష్ట‌మౌతోంది. స‌ర్జిక‌ల్ దాడుల‌తో భార‌త్ సాధించింది ఏదీ లేద‌నీ, అలాంటివేవీ జ‌ర‌గ‌లేద‌ని పాక్ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇంకోప‌క్క‌ - అంత‌ర్జాతీయ వేదిక‌పై కూడా భారత్ అబ‌ద్ధాల కోరుగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న‌ది అర్థ‌మౌతోంది. స్వదేశీ మీడియాలో ఇలాంటి క‌థ‌నాలు వండి వార్చుతూ ఉండ‌టంతో పాటు, భార‌తదేశానిక చెందిన టెలివిజ‌న్ ఛానెల్స్ ప్ర‌సారంపై పాక్‌ లో నిషేధం విధించ‌డం గ‌మ‌నార్హం. రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేప‌థ్యంలో కొన్ని భార‌తీయ ఛానెల్స్ అభ్యంత‌ర‌క‌ర ప్ర‌సారాలు చేస్తున్నాయ‌ని ఫిర్యాదులు రావ‌డంతో కొన్ని ఛానెల్స్‌ ను పాక్‌ లో నిషేధిస్తున్న‌ట్టు ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే, స‌ర్జిక‌ల్ దాడుల విష‌యంలో పాక్ అనుస‌రిస్తున్న ఈ దుర్నీతిని తిప్పికొట్టేందుకు భార‌త్ సిద్ధ‌మౌతున్న‌ట్టుగానే ఉంద‌ని చెప్పాలి. ఎల్‌.ఓ.సీ. అవ‌త‌ల‌ దాడులు జ‌ర‌గ‌లేద‌ని పాక్ బుకాయింపుల‌కు ధీటైన స‌మాధానం చెప్ప‌బోతున్న సంకేతాలు వెల‌వ‌డ్డాయి. జ‌ర్జిక‌ల్ దాడులు వీడియో విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దాడుల విష‌యంలో అబ‌ద్ధాలు చెబుతూ ప్ర‌పంచాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్న పాక్ దుర్నీతిని అడ్డుకునేందుకు దాడుల వీడియో ఫుటేజ్‌ ను విడుద‌ల చేయ‌డ‌మో ధీటైన జ‌వాబు అని భార‌త్ యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని నేరుగా ప్ర‌స్థావించ‌క‌పోయినా.. హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు దీనికి బ‌లం చేకూర్చుతున్నాయి. స‌ర్జిక్ దాడుల విష‌యంలో మ‌న సైన్యం దుమ్ము రేపార‌నీ - కాస్త ఓపిక ప‌డితే త్వ‌ర‌లోనే మీరే చూస్తారంటూ విలేక‌రులు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఇలా జ‌వాబు చెప్పారు. సో... స‌ర్జిక‌ల్ దాడుల వీడియో బ‌య‌ట‌కి వ‌స్తే పాక్ ప‌రువు న‌ట్టేట మున‌గ‌డం ఖాయం. అప్పుడు పాక్ ఎలా గుక్క‌తిప్పుకుంటుందో చూడాలి మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/