Begin typing your search above and press return to search.
భారతీయ పాట పాడినందుకు పాక్ యువతికి శిక్ష
By: Tupaki Desk | 4 Sep 2018 11:14 AM GMTభారతీయ పాట పాడినందుకు పాకిస్తాన్ ఎయిర్ పోర్టు ఆథార్ఠీ తన సంస్థలో పనిచేసే ఓ 25ఏళ్ల మహిళా ఉద్యోగికి జరిమానా విధించింది. అంతేకాదు.. ఆమెకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ - ప్రోత్సహాకాలను రెండేళ్ల పాటు నిలిపివేసింది. కేవలం భారతీయ పాట పాడినందుకే ఇలా చేశారని తెలియడంతో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
సియాల్ కోట్ ఎయిర్ పోర్టులో పనిచేసే ఆ యువతి భారత్ కు చెందిన ఓ పంజాబీ పాటను పాడుతూ సెల్ఫీ తీసుకుంది. పాకిస్తాన్ పతాకం ఉన్న క్యాప్ ను ధరించి భారతీయ పాట పాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో ఎయిర్ పోర్టు ఆథార్ఠీ అధికారులకు చేరడంతో దీన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు.
భారతీయ పాట పాడినంత మాత్రాన సస్పెండ్ చేస్తారా అంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. యువతిపై విధించిన ఆంక్షలను తొలగించాలని పెద్ద ఎత్తున అందరూ కోరడంతో చివరకు ఎయిర్ పోర్టు ఆథార్టీ యువతిపై ప్రవర్తన నియామవళి ఉల్లఘించిందని కొత్త పల్లవి అందుకున్నారు. యువతిపై ఆంక్షలు ఎత్తివేయలేమంటూ తb చర్యలను సమర్థించుకున్నారు.