Begin typing your search above and press return to search.
ఇండియన్లపై ‘ఖలిస్తాన్’ దాడి
By: Tupaki Desk | 10 March 2019 7:50 AM GMTపాకిస్తాన్ ప్రేరిపిత ఖలిస్తాన్ అనుకూలవాదులు బ్రిటన్ రాజధాని లండన్ లో రెచ్చిపోయారు. భారతీయులపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. లండన్ లోని ఇండియన్ హైకమిషన్ వెలుపల వివిధ పనుల కోసం వచ్చిన బ్రిటీష్-ఇండియన్ పౌరులపై శనివారం ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడిచేశారు.
ఖలిస్తాన్ అనుకూల వాదుల దాడిలో భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. అయినా వదలకుండా ఖలిస్తాన్ వాదులు పిడిగుద్దలు గుద్దారు. తలపాగాలు ధరించిన ఖలిస్తాన్ అనుకూల ఆందోళనకారులు భారత వ్యతిరేక నినాదాలతో హైకమిషన్ వద్ద ఆందోళన చేశారు. వీసా సంబంధింత అపాయింట్లమెంట్ల కోసం హైకమిషన్ కు వచ్చిన భారతీయులే లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిసింది. ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 40మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం తర్వాత పాకిస్తాన్ ఏకాకి అయ్యి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఖలిస్తాన్ ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఈ దాడులకు పురిగొల్పినట్టు లండన్ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా గత నెలలో భారత్ పాకిస్తాన్ వాయు దాడులు జరపడం.. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తడంతో అందుకు ప్రతీకారంగానే ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్తాన్ అనుకూలవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.