Begin typing your search above and press return to search.
భారత పైలెట్ మిస్సింగ్.. పాక్ వీడియో వైరల్
By: Tupaki Desk | 27 Feb 2019 11:16 AM GMTభారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 పైలెట్ మిస్సయ్యారు. ఈవిషయాన్ని స్వయంగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ధ్రువీకరించారు. బుధవారం ఉదయం భారత భూభాగంలోకి పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లు చొచ్చుకొచ్చాయి. దీన్ని భారతీయ వాయుసేన అధికారులు నేలకూల్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవీష్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అయితే పాక్ ఎయిర్ క్రాఫ్ట్ లను నేలకూల్చే సందర్భంగా భారత మిగ్ 21 విమానం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మిస్ అయ్యిందని.. ఈ ఘటనలోనే మిగ్ 21ను కూల్చేశారని పాకిస్తాన్ ఆర్మీ ప్రచారం చేసుకుంటోంది. దానికి సంబంధించిన అభినందన్ అనే పైలెట్ ను బంధించినట్టు ఓ వీడియో పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ పైలెట్ పేరు అభినందన్ అని తన బ్యాచ్ నంబర్ చెప్పి మిగతా వివరాలు చెప్పలేనంటూ తెలిపారు. ఈ వీడియో ను చూపించి తాము భారత పైలెట్ ను బంధించినట్లు పాకిస్తాన్ చెబుతోంది.
అయితే తాజాగా భారత విదేశాంగ శాక మాత్రం తమ మిగ్ విమానంతోపాటు పెలైట్ ఒకరు మిస్ అయ్యారని చెబుతోంది. ఆ పైలెట్ అభినందనేనా.? పాకిస్తాన్ పట్టుకున్న వ్యక్తి భారత పైలెటా.? కాదా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పటికే భారత్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్తాన్ చాలా తప్పుడు వార్తలు, కథనాలు, వీడియోలు వదలుతూ భారత్ ఆత్మస్తైర్థ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఆ కోవలోనే భారత పైలెట్ ను బంధించామంటోంది. దీనిపై భారత్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.