Begin typing your search above and press return to search.

మోడీ, రాఖీ సావంత్‌...సేమ్ టు సేమ్‌

By:  Tupaki Desk   |   29 Sep 2015 3:53 PM GMT
మోడీ, రాఖీ సావంత్‌...సేమ్ టు సేమ్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ఆయ‌న‌కు అగ్ర‌తాంబులం ద‌క్క‌డంలో వింతేమీ లేకున్నా...కొన్ని సంద‌ర్భాల్లో వివాదాస్ప‌ద‌, ఆస‌క్తిక‌ర అంశాల ద్వారా తెర‌మీద‌కు రావ‌డంలోనే ట్విస్ట్ ఉంది. అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడిపిన ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్‌ మీడియా ర‌క‌ర‌కాల కోణాల్లో విశ్లేషించింది. కొన్ని ప‌త్రిక‌లు మోడీ తీరును ప్ర‌శంసించ‌గా... ఒక పత్రిక అయితే ఏకంగా మోడీని ఐటంగర్ల్‌ రాఖీ సావంత్‌గా పోల్చింది.

"సినిమా మొత్తం ఒక ఎత్తయితే..అందులో ఐటం సాంగ్‌ మరో ఎత్తు. ప్రధానంగా రాఖీసావంత్‌లాంటి వారు ఆ సాంగ్‌లో చిందులు వేస్తే మరింత అద్వితీయంగా ఉంటుంది. ప్రేక్షకులందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అలాగే మోడీ, అమెరికా పర్యటనలో చాలా చలాకీగా, బిజీగా గడిపితే, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కేవలం ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సమావేశానికి పరిమితమయ్యారు " అని ఎక్స్‌ ప్రెస్ ట్రిబ్యూన్ అనే పాక్‌ పత్రిక పేర్కొంది. అమెరికాకు వెళ్లిన షరీఫ్‌ ఎవరిని పలకరించడంగానీ, ఎవ‌రితో స‌మావేశం గానీ కాలేదని చెప్పింది. అయితే అదే సమావేశానికి మోడీ వెళ్లి దుమ్ము రేపాడ‌ని కీర్తించింది. దాదాపు స్టార్‌ కాంపైనర్‌ తరహాలో సిలికాన్‌ వ్యాలీని చుట్టేసి రావడంతోపాటు ప్రవాస భారతీయులను - ఫ్రాన్స్‌ - బ్రిటన్‌ - యుఎస్‌ అధ్యక్షులతోపాటు జి 4లో సమావేశం లాంటివాటికి హాజరయ్యారని కీర్తించింది. పలు అంశాలపై చర్చించడం, అనేక అంశాల‌పై ఒప్పందాలు కుద‌ర్చుకోవ‌డం ఇలా....మోడీ యుఎస్‌ పర్యటన ఆధ్యంతం పూర్తి బిజీ బిజీ గానే గడిచిపోయిందని, అందరినీ ఆకర్షించగలిగారని పాక్‌ మీడియా కీర్తించింది.

పొరుగుదేశాలుగా ఉన్న భార‌త్‌-పాకిస్తాన్‌ ల ప్ర‌ధానుల ప‌ర్య‌ట‌న‌ను విశ్లేషించ‌డంలో త‌ప్పేమీ లేన‌ప్ప‌టికీ...ఇబ్బందిక‌ర‌మైన పోలిక‌లే నాయ‌కుల‌కు స‌మ‌స్య‌లు తెచ్చిపెడ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌మ ప్ర‌ధానిని చేత‌కానిత‌నాన్ని చెప్పేందుకు పొరుగుదేశం ప్ర‌ధాన‌మంత్రి ఈ ర‌కంగా పోల్చాలా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.