Begin typing your search above and press return to search.
అధికారికం: భారత జవాన్ పాక్ వద్దే ఉన్నాడు
By: Tupaki Desk | 14 Oct 2016 5:26 AM GMTసరిహద్దుల్లోని నియంత్రణ రేఖను దాటి పొరబాటున పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్ళి - అక్కడి సైన్యానికి పట్టుబడ్డ భారత జవాన్ చందు బాబూలాల్ చౌహాన్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయని పాకిస్థాన్ మొట్టమొదటిసారిగా అధికారికంగా స్పందించింది. అయితే తమ భూభాగంలోకి ప్రవేశించిన చౌహాన్ ను యుద్ధ ఖైదీగా బంధించామని తెలిపింది. దీంతో పొరబాటున పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్ళిన చౌహాన్ త్వరలో భారత్ కు తిరిగి వచ్చే అవకాశాలు బలపడ్డాయి. ఎందుకంటే... ఇరు దేశాల మధ్య నిబంధనల ప్రకారం చౌహాన్ భారత్ తిరిగి అప్పగించాల్సి ఉంటుంది!
ఈ వార్త తెలియగానే మహరాష్ట్ర ధూలే జిల్లాలోని అతడి చౌహాన్ తాత గారింట్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు - స్నేహితులు అంతా ఒక్కచోట చేరి ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా... చందూ బబూలాల్ ను ఎలాగైనా భారత్ రప్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీపై తామంతా ఎంతో నమ్మకంగా ఉన్నామని చెప్తున్నారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చందూ బాబూలాల్ చౌహాన్ సహా - అతడి సోదరుడు భూషఢ్ చౌహాన్ లను అవ్వ - తాత లు చేరదీసి పెంచారు. కాగా, చందూలాల్ బందీగా మారాడన్న వార్త తెలియడంతో అతడి అవ్వ రెండు వారాలక్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
కాగా, జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన రోజే 37 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సైనికుడు చందు బాబూలాల్ చౌహాన్ పొరపాటున నియంత్రణ రేఖదాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. అయితే ఈ విషయంపై భారత్ పాక్ కు అధికారికంగా తెలియజేసినా రెండు వారాలుగా ఆ విషయాన్ని పాకిస్థాన్ ధృవీకరించలేదు. కానీ, చౌహాన్ తమ నిర్బంధంలో ఉన్నట్లు అంగీకరిస్తూ ఆర్మీ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ భారత అధికారులకు తెలియజేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/