Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ పరువు ఫ్రాన్స్ లో కలిసిపోయింది

By:  Tupaki Desk   |   3 Oct 2019 9:41 AM GMT
పాకిస్థాన్ పరువు ఫ్రాన్స్ లో కలిసిపోయింది
X
ఇప్పటికే కాశ్మీర్ అంశం మీద రచ్చ చేయడానికి ప్రయత్నించిన పాకిస్థాన్ ప్రపంచం దృష్టిలో అభాసుపాలైంది. ఇప్పటివరకు కాశ్మీర్ అంశం పైన అంతర్జాతీయ వేదికఫై భారత్ ను దోషిగా నిలబెట్టడానికి పాకిస్థాన్ ఎన్నో కుట్రలు చేసింది. అయినా చైనా లాంటి ఒకటి రెండు దేశాలు తప్ప ప్రపంచ దేశాలన్నీ భారత్ కు అండగా నిలిచి, పాకిస్థాన్ ను ఛీ కొట్టినా ఆ దేశానికి ఇంకా బుద్ధి రావట్లేదు. ఇంకా ఇంకా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశం గురించి మాట్లాడాలని, తమకేదో అన్యాయం జరిగిపోతుందని, ఇండియాలో ముస్లిం లకు రక్షణ లేదనీ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ముసలి కన్నీరు కార్చడానికి ప్రయత్నిస్తుంది. వీటన్నింటికి ఇండియా ధీటుగా సమాధానం చెప్తూ పాకిస్థాన్ చెంప చెళ్లుమనిపిస్తుంది.

తాజాగా ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ప్రసంగించాల్సి ఉండగా భారత్ దీనిని అడ్డుకుంది. ఫ్రెంచ్ దిగువ సభలో మసూద్ ఖాన్ మాట్లాడడానికి మొదట అనుమతిచ్చిన ఫ్రాన్స్ ప్రభుత్వం తర్వాత భారత్ ఒత్తిడితో దిగి వచ్చింది. మసూద్ ఖాన్ ప్రసంగించడానికి అనుమతిస్తే భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్టే అని భారత దౌత్యాధికారులు హెచ్చరించారు. దీంతో మసూద్ ప్రసంగానికి ఫ్రాన్స్ అనుమతి నిరాకరించింది. దీంతో మసూద్ ఖాన్ తరపున దౌత్యాధికారి మోని ఉల్ హక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీవోకే అధ్యక్షుడికి ఏర్పాటు చేసిన విందు కూడా రద్దయింది. దీంతో పాక్ మరొకసారి ఒంటరైంది.