Begin typing your search above and press return to search.
కోహ్లీ మీద ఈగ వాలనివ్వని పాకిస్థానీలు
By: Tupaki Desk | 14 Sep 2017 4:19 AM GMTభారత్ అంటే మండిపడే పాకిస్థానీలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే మాత్రం పడిచస్తున్నారు. అంతేకాదు... కోహ్లీపై ఎవరు విమర్శలు చేసినా భారతీయుల కంటే ఎక్కువగా స్పందిస్తూ వాటిని ఖండిస్తున్నారు. ఇటీవలే టీచర్స్ డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ కి భారతీయుల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ, పాకిస్థానీయుల నుంచి మాత్రం ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీకి మరోసారి పాకిస్థానీయుల నుంచి ఊహించని సపోర్టు దొరికింది.
తాజాగా ఆస్ట్రేలియా జర్నలిస్టు ఒకరు కోహ్లీని స్వీపర్ గా పేర్కొంటూ.. కోహ్లీ గతంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొంటుండగా తీసిన ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై పాక్ లోని కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీకి మద్దతుగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ను - ఆస్ట్రేలియా జర్నలిస్టును ఎండగడుతున్నారు.
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ టెస్టుల్లో ఐదవ స్థానంలో ఉంటే భారత క్రికెట్ టీమ్ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేస్తూ స్వీపర్ల కన్నా ఆస్ట్రేలియా కింది స్థాయిలో ఉందని ఏకిపడేస్తున్నారు. క్రికెట్ ఆట అంటే రాజకీయాలు కాదని ఓ పాకిస్థానీ అభిమాని కామెంట్ చేశాడు. లెజెండ్ లాంటి కోహ్లీపై ఇటువంటి ట్వీట్లు చేయవద్దని, తమ దేశంలో జరుగుతోన్న వరల్డ్ ఎలెవన్ టీమ్ లో కోహ్లీ లేనందుకు తాము ఎంతగానో బాధపడిపోతున్నామని మరో అభిమాని ట్వీట్ చేశాడు. మొత్తానికి కోహ్లీపై పాకిస్థానీలు చూపుతున్న అభిమానం చూస్తుంటే రెండు దేశాల మధ్య స్పర్థలు రాజకీయమైనమే తప్ప ప్రజల్లో ఎలాంటి కల్మషం లేదని అర్థం అవుతోంది.