Begin typing your search above and press return to search.
అఫ్రిదికి అల్లుడవుతున్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ !
By: Tupaki Desk | 8 March 2021 10:59 AM GMTపాక్ యంగ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సాని త్వరలోనే అతను పెళ్లి చేసుకోబుతున్నాడు. ఈ మేరకు నిశ్చితార్థానికి ఇప్పటికే తేదీని కూడా ఇరు కుటుంబాలు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో షాహిద్ అఫ్రిదీకి ప్రత్యర్థిగా మ్యాచ్ లు ఆడటం విశేషం. అఫ్రిదీకి ఐదుగురు కుమార్తెలు. అక్సా, అన్షా, అజ్వా, అస్మరా, ఆర్వా. వీరిలో పెద్ద కుమార్తె అక్సా. అయితే షాహీన్, అక్సాలకు 20 ఏళ్లే కావడం విశేషం.
అఫ్రిది కుటుంబంతో గత కొన్నినెలలుగా చర్చలు జరిపినట్లు తాజాగా చెప్పుకొచ్చిన షాహీన్ షా అఫ్రిదీ తండ్రి అయాజ్.. ఎట్టకేలకి వారు పెళ్లికి ఒప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు షాహిద్ అఫ్రిది కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తన పెద్ద కూతురు కోసం షాహిన్ ఫ్యామిలీ తమని కలిసిందని వెల్లడించిన అఫ్రిది రెండు కుటుంబాలు టచ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అలానే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని.. అల్లా దయదలిస్తే ఈ పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాడు. పాక్ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ గా ఎదుగుతున్న షాహీన్ కెరీర్ బాగుండాలని అఫ్రిదీ ఆకాంక్షించాడు.
2018లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన షాహిన్ అఫ్రిది.. ఇప్పటి వరకూ 15 టెస్టులు, 22 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో ఇప్పటికే 117 వికెట్లని పడగొట్టిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడడంతో ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు ఖాళీగానే ఉన్నారు.