Begin typing your search above and press return to search.

బార్డర్ దాటిన ఆ హెలీక్యాప్టర్ లో పీఓకే ప్రధాని

By:  Tupaki Desk   |   1 Oct 2018 11:12 AM GMT
బార్డర్ దాటిన ఆ హెలీక్యాప్టర్ లో పీఓకే ప్రధాని
X
పాకిస్తాన్ కు చెందిన ఓ హెలీక్యాప్టర్ ఆదివారం భారత భూభాగంలోకి వచ్చి చక్కర్లు కొట్టి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగిన ఈ ఘటనలో భారత జవాన్లు స్వల్పంగా కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ హెలీ క్యాప్టర్ పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది. అయితే తాజాగా ఈ హెలీ క్యాప్టర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని రజా ఫరూఖ్ హైదర్ ఖాన్ ది అన్నట్టు పాకిస్తాన్ మీడియా సంస్థ ఆజ్ న్యూస్ పేర్కొంది. అంతర్జాతీయ మీడియాలోనూ భారత్ కాల్పులు జరిపిందని వార్తలొచ్చాయి. పీఓకే ప్రధాని ఫరూఖ్ హైదర్ ఖాన్ ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ తరోరీ ప్రాంతంలో ల్యాండ్ అవుతుండగా భారత జవాన్లే కాల్పులు జరిపారని పేర్కొన్నారు. తాము అసలు భారత భూభాగంలోకే రాలేదని వారు వెల్లడించినట్లు తెలిపారు.

హెలీక్యాప్టర్ బార్డర్ దాటడంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఆ హెలీక్యాప్టర్ లో ఎలాంటి ఆయుధాలు లేవని.. భారత దళాలు ఎందుకు కాల్పులు జరిపాయో తెలుపాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విమానం ఉద్దేశపూర్వకంగా వచ్చిందా.? లేక పొరపాటున నావిగేషన్ సమస్య వల్ల వచ్చిందా అన్నది తెలియరావడం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పాడైపోవడం వల్లే బార్డర్ దాటి ఉండవచ్చని భారత బలగాలు అంచనావేస్తున్నాయి.