Begin typing your search above and press return to search.

నో బాల్ కు ఔటిచ్చి భారత్ ను దెబ్బ తీశారా?

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:20 AM GMT
నో బాల్ కు ఔటిచ్చి భారత్ ను దెబ్బ తీశారా?
X
చిరకాల ప్రత్యర్థి.. హైఓల్టేజ్ మ్యాచ్ గా అభివర్ణించే దాయాదుల సమరం.. తాజాగా టీమిండియాను భారీగా దెబ్బ తీసింది దారుణ ఓటమితో టీమిండియానే కాదు.. కోట్లాది మంది అభిమానులు నీరసపడిపోయిన పరిస్థితి. ఘోర పరాభవానికి కారణం.. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు త్వరగా ఔట్ కావటమే. అయితే.. టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను ఔట్ గా ప్రకటించిన వైనంపై సోషల్ మీడియాలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నో బాల్ కు అవుట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు? షహీన్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. ఆ బంతిని వేసిన వేళ.. షహీన్ కాలు గీత దాటినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించటంతో.. టీమిండియా అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఎవరూ దీనిపై స్పందించలేదని వాపోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ కు.. బ్యాటింగ్ అప్పజెప్పింది పాక్ జట్టు. తొలి ఓవర్లోనే కీలకమైన రోహిత్ శర్మ సున్నాకు ఔట్ కావటం..ఆ వెంటనేమూడో ఓవర్లో రాహుల్ మూడు పరుగులకు ఔట్ అయ్యారు. అయితే.. అతని ఔట్ ను ప్రకటించిన నిర్ణయాన్ని అభిమానులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. దీనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ హాట్ గా సాగుతోంది. టీమిండియాను దెబ్బ తీయటంలో అంపైర్ నిర్ణయం కూడా ఉందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.